ఐదేళ్ల 'పూజా' ఎదురుచూపులకు తెర..!

ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన పూజా హెగ్డే ఆ వెంటనే వరుణ్‌ తేజ్‌ నటించిన 'ముకుంద' సినిమాలోనూ నటించింది.;

Update: 2025-08-09 08:29 GMT

ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన పూజా హెగ్డే ఆ వెంటనే వరుణ్‌ తేజ్‌ నటించిన 'ముకుంద' సినిమాలోనూ నటించింది. రెండు సినిమాలు ఒక మోస్తరుగానే ఆడటంతో టాలీవుడ్‌లో ఈమె నిలదొక్కుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే లక్కీగా అల్లు అర్జున్‌ హీరోగా హరీష్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'డీజే' సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. మొదటి రెండు సినిమాలతో పోల్చితే పూర్తి విరుద్దంగా డీజే సినిమాలో హాట్‌ లుక్‌ లో కనిపించి సర్‌ప్రైజ్‌ చేసింది. స్కిన్‌ షో చేయడం ద్వారా పూజా హెగ్డే కి ఒక్కసారిగా పాపులారిటీ దక్కింది. టాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ హీరోయిన్‌గా కూడా పూజా హెగ్డే నిలిచింది. టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా నిలిచింది.

కెరీర్‌ ఆరంభంలో పూజా హెగ్డే బిజీ బిజీ

రంగస్థలం సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించడంతో పాటు, ఎన్టీఆర్‌ సినిమాలో అరవింద సమేత సినిమాలో నటించడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఆ వెంటనే హిందీ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఒకానొక సమయంలో స్టార్‌ హీరోల సినిమాలకు సైతం డేట్లు ఇవ్వలేనంత బిజీగా పూజా హెగ్డే బిజీ బిజీగా సినిమాలు చేసింది. అంతటి క్రేజ్‌ ను దక్కించుకున్న పూజా హెగ్డే గత ఐదు సంవత్సరాల్లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. టాలీవుడ్‌లో ఈమె సినిమాలు చేయలేక పోయింది. ఈమె చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ విఫలం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర భాషల్లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. అక్కడి సినిమాలు కూడా పూజా హెగ్డేకి అంతగా స్టార్‌డం తెచ్చి పెట్టలేదు.

నితిన్‌ కు జోడీగా పూజా హెగ్డే

తెలుగులో పూజా హెగ్డే చివరగా రాధే శ్యామ్‌ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. ఎఫ్ 3 లో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా ఫామ్‌ లోకి రావాలని ప్రయత్నాలు చేసింది. అయినా కూడా పూజా హెగ్డేకి ఆఫర్లు రాలేదు. తెలుగులో ఈమె సినిమాలు చేసి ఐదేళ్లు అవుతుంది. ప్రేక్షకులు, ఫిల్మ్‌ మేకర్స్ ఈమెను పక్కన పెడుతున్నారు. మెల్ల మెల్లగా మర్చి పోతున్నారు అనుకున్న సమయంలో లక్కీగా నితిన్‌ కు జోడీగా ఒక సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే నితిన్‌ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆ సినిమాలో పూజా హెగ్డేను ఎంపిక చేయడం ద్వారా వార్తలు వస్తున్నాయి.

విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో స్వారీ

విభిన్నమైన చిత్రాలను రూపొందించే దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమాను భారీ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిస్తున్న విషయం తెల్సిందే. గుర్రపు స్వారీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది. నితిన్‌ గత కొన్ని నెలలుగా గుర్రపు స్వారీ ప్రాక్టీస్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే ను ఈ సినిమాలో నటింపజేయడం ద్వారా ఖచ్చితంగా మంచి బజ్ క్రియేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఫామ్‌ లో లేని నితిన్‌, అసలు గేమ్‌ లో లేని పూజా హెగ్డే కాంబో మూవీ ఏంటో అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News