• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కు పొలిటికల్...

పవన్ కు పొలిటికల్ బూస్ట్.. స్ట్రాంగ్ టీజర్ రెడీ!

| ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి.

By - Tupaki Desk
Update: 2024-03-16 07:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్నారు జనసేనాని. దీంతో తాను ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలన్నింటినీ పక్కన పెట్టేశారు పవన్. అన్ని ప్రాజెక్టులకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఎన్నికల తర్వాత సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి.

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా తక్కువ రోజులు మాత్రమే జరిగింది. పవన్ బిజీ అవ్వడంతో బ్రేక్ పడింది. దీంతో హరీష్ శంకర్.. రవితేజతో సినిమా చేస్తున్నారు. హిందీ రైడ్ రీమేక్ గా మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

అయితే తమిళ స్టార్ హీరో విజయ్ సూపర్ హిట్ మూవీ తేరికి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే.. రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఉస్తాద్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇప్పటికే జరిగిన షూటింగ్ పార్ట్ లో పవన్.. పోలీస్ పాత్రలో ప్రభుత్వంపై వేసిన కొన్ని కౌంటర్ డైలాగ్స్ ఉన్నాయట. వాటితో ఒక డైలాగ్ టీజర్ కట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఈ కొత్త టీజర్.. పవన్ రాజకీయాలకు మంచి బూస్టప్ ఇవ్వనుందట. ప్రస్తుతం ఏపీలో పవన్ పెద్ద ఎత్తున రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే టైంలో డైలాగ్ టీజర్ రిలీజ్ చేస్తే పవన్ ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపొచ్చని మేకర్స్ అనుకుంటున్నారట.

మరోవైపు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఇంకొందరు.. ఉస్తాద్ డైలాగ్ టీజర్ రెడీ అవుతుందని, ఇదే నిజమేనని చెబుతున్నారు. కానీ ఎన్నికల సంబంధించినది కాదని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    
  • Apelections 
  • Jsp 
  • Tdp 
  • Bjp 
  • Chandrababu 
  • Pawankalyan 
  • Ustaadbhagatsingh 
  • Harishshankar 
  • Raviteja 
  • MrBachchan 
  • Devisreeprasad 
  • Sreeleela 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS