• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మూవీ పైరసీ చేస్తే.. ...

మూవీ పైరసీ చేస్తే.. శిక్ష ‘లెక్క’ మారింది జాగ్రత్త!

| ఇటీవల కాలంలో హిట్టు, ఫట్టూ అనే ఫలితం సంగతి కాసేపు పక్కనపెడితే.. సినిమాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య "పైరసీ" అని చెప్పొచ్చు.

By - Tupaki Desk
Update: 2025-07-28 05:06 GMT

ఇటీవల కాలంలో హిట్టు, ఫట్టూ అనే ఫలితం సంగతి కాసేపు పక్కనపెడితే.. సినిమాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య "పైరసీ" అని చెప్పొచ్చు. ఈ క్రమంలో... డిజిటల్ పైరసీని అరికట్టే ప్రయత్నంలో భాగంగా చట్టవిరుద్ధంగా సినిమాలను రికార్డ్ చేయడం, ప్రసారం చేయడంలో పాల్గొన్న వారికి శిక్షలు పెంచేలా ప్రభుత్వం చట్టాన్ని సవరించింది.

అవును... సినిమాలను రికార్డ్ చేయడం, ప్రసారం చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి శిక్షలు పెంచేలా ప్రభుత్వం చట్టాలను సవరించింది. ఇందులో భాగంగా... ఇకపై పైరసీ చేసినా, దాన్ని ప్రసారం చేసినా జైలు శిక్షతో పాటు నిర్మాణ వ్యయంలో ఐదు శాతం వరకూ కఠినమైన జరిమానాలు విధించేలా ప్రభుత్వం చట్టాన్ని సవరించింది!

ఈ సందర్భంగా స్పందించిన సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురగన్... గతంలో పైరసీకి మూడు నెలల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా ఉన్నాయని.. అయితే, తాజాగా దానిని మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఆడిట్ చేయబడిన స్థూల ఉత్పత్తి వ్యయంలో ఐదు శాతం వరకు జరిమానా విధించవచ్చని పార్లమెంటుకు తెలిపారు.

ఈ సందర్భంగా... సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 6ఏఏ, 6ఏబీ అనధికారికంగా సినిమాలను రికార్డ్ చేయడం, ప్రసారం చేయడాన్ని నిషేధిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో పైరసీ వ్యతిరేక వ్యూహాలను బలోపేతం చేయడానికి, సమన్వయ కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేశారు.

కాగా... ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) నిర్వహించిన ‘ది రాబ్’ నివేదిక ప్రకారం 2023లో భారత వినోద పరిశ్రమ ప్రధానంగా పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంది!

Tags:    
  • StopPiracy 
  • CinemaLaw 
  • IndianCinema 
  • FilmProtection 
  • AntiPiracy 
  • DigitalRights 
  • OTTProtection 
  • EntertainmentLaw 
  • PiracyFreeIndia 
  • TeluguCinema 
  • LMurugan 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS