• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తండ్రిని కోల్పోయిన...

తండ్రిని కోల్పోయిన రోజుల్లోనే బ‌య‌ట‌పడిన న‌టి నైజం!

| అయితే ఈ సంఘటన వీడియో వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డంతో అభిమానులు, నెటిజ‌నుల నుంచి స్పంద‌న అనూహ్యంగా ఉంది.

By - Tupaki Desk
Update: 2024-10-07 01:30 GMT

తన తండ్రి అనిల్ మెహతా ఇటీవల మరణించిన తరువాత మలైకా అరోరా బ‌య‌టి ప్ర‌పంచానికి దూర‌మైంది. ఎప్పుడూ చిల్లింగ్ గా ఉండే మ‌లైకాకు ఇది దుఃఖ కాలం. ఈ నష్టం ఆమెను ఆమె కుటుంబాన్ని తీవ్ర శోకంలో కూరుకుపోయేలా చేసింది. అయితే ఒక న‌ష్టం త‌ర్వాత తిరిగి త‌న విధినిర్వ‌హ‌ణ‌లోకి రావ‌డం ఎలానో మ‌లైకాకు తెలుసు. ఈ శుక్రవారం తండ్రి మరణం తర్వాత మొదటిసారిగా మలైకా బహిరంగంగా కనిపించింది. ప్రఖ్యాత జ్యువెలరీ బ్రాండ్ నిర్వహించిన నవరాత్రి ఈవెంట్‌కు హాజరైంది. కార్పెట్‌పై నడుస్తూ కెమెరాలకు పోజులిచ్చింది. అయితే ఈ సంఘటన వీడియో వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డంతో అభిమానులు, నెటిజ‌నుల నుంచి స్పంద‌న అనూహ్యంగా ఉంది.


మలైకా తిరిగి ఒక బ్రాండ్ ప్ర‌చారంతో ప్రజల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నించింది.. కానీ దీనికి ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. సంప్రదాయ సంతాప దినాలు దాటకముందే ఓ కార్యక్రమానికి హాజరైనందుకు కొందరు నెటిజనులు మ‌లైకాను విమర్శించారు. ఒక నెటిజ‌న్ ఇలా వ్యాఖ్యానించారు. ``మీ తండ్రి ఇప్పుడే మరణించారు. మీరు ఇప్పటికే సంతాపాన్ని ముగించారా? అని ప్ర‌శ్నించ‌గా, మరొకరు ``ఆమె ఎంత సులభంగా ముందుకు సాగింది!.. కుటుంబంలో విషాదం అయిన‌ వెంటనే ఉత్సవాల్లో కనిపించడం సిగ్గుచేలు`` అని పేర్కొన్నారు.

అయితే మ‌లైకాకు మ‌ద్ధ‌తు ప‌లికిన అభిమానులు లేక‌పోలేదు. ప్రజల దృష్టిలో పబ్లిక్ ఫిగర్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను, విమ‌ర్శ‌కుల‌ ద్వంద్వ ప్రమాణాలను చాలా మంది ఎత్తి చూపారు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే 15-20 రోజుల తర్వాత మనమందరం తిరిగి పనికి వెళ్తాం. ఇది ఆమె పని.. గౌరవిద్దాం! అని ఓ అభిమాని చెప్పాడు. ప్రజలు చాలా త్వరగా తీర్పు ఇస్తారు! ఇది ఆమె పని.. ఆమె ఇప్పటికీ ప్రైవేట్‌గా దుఃఖిస్తోంది అని ఒక‌రు మ‌ద్ధ‌తు ప‌లికారు. ప్రజల్లో ఉండే వ్యక్తులను అన్ని సమయాల్లో పరిశీలించాల్సిన అవసరం లేదు. ఆమె దుఃఖాన్ని తట్టుకుంటూ తన జీవితాన్ని గడపడానికి ఆమెకు అనుమతి ఉంది అని మ‌రొక‌రు మ‌ద్ధ‌తు ప‌లికారు.

ఈవెంట్‌లో మలైకా దుస్తులలో బంగారు అంచుతో కూడిన అందమైన ఐవరీ చీర, సంప్రదాయ ఆభరణాలతో ఎంతో సొగ‌సుగా క‌నిపించింది. ఇందులో మ‌ల్టీ లేయర్డ్ పెర్ల్ నెక్లెస్, పచ్చ లాకెట్టు ఉన్నాయి. మ‌లైకా కెమెరాల‌కు ఫోజులిస్తూ ఎంతో సొగ‌సుగా క‌నిపించింది.

ఇటీవల మలైకా స్కార్పియో-నేపథ్యం ఉన్న‌ కోట్‌తో ఇన్‌స్టా స్టోరీని షేర్ చేసింది..అక్టోబర్ మీకు మంచిగా ఉంటుంది. వృశ్చికరాశి వారికి అనేది సారాంశం. మలైకా వ్య‌క్తిగతంగా న‌ష్టాన్ని చ‌వి చూసినా కానీ, వెలుగునిచ్చే రోజులను ఆశిస్తూ అక్టోబర్ 23న తన 51వ పుట్టినరోజు జరుపుకోనుంది. కరీనా కపూర్ ఖాన్ , కరిష్మా కపూర్ వంటి సన్నిహితులు మలైకాకు ఎప్పుడూ మద్దతుగా ఉన్నారు. ఈ కష్ట సమయంలో ఓదార్పునిచ్చేందుకు తరచుగా మలైకా బాంద్రా ఇంటికి వెళ్తుంటారు.

Tags:    
  • Bollywood 
  • Filmindustry 
  • Malaikaarora 
  • AnilMehta 
  • Passedaway 
  • Malaikafather 
  • Socialmedia 
  • Instagrampost 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS