'పెద్ది'వ‌ల్ల ర‌విబాబు ఇబ్బందిప‌డ్డారా అదెలా?

ఒక పెద్ద సినిమా వ‌చ్చేస్తోందంటే చిన్న సినిమాల రిలీజ్‌లు ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డుతుంటాయి.;

Update: 2026-05-01 12:45 GMT

ఒక పెద్ద సినిమా వ‌చ్చేస్తోందంటే చిన్న సినిమాల రిలీజ్‌లు ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డుతుంటాయి. థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని, త‌మ సినిమాకు థియేట‌ర్లు ల‌భించ‌వ‌ని, సినిమా బాగున్నా పెద్ద సినిమా ప్ర‌వాహంలో కొట్టుకుపోతుంద‌ని చిన్న సినిమాల‌ని రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు భ‌య‌ప‌డుతుంటారు. అలా గ‌త రెండు మూడు నెల‌లుగా ఒక పెద్ద సినిమా రిలీజ్ వ‌ల్ల చాలా వ‌ర‌కు చిన్న సినిమా రిలీజ్‌కు ఇబ్బందిప‌డుతున్నాయి. పెద్ద సినిమా రిలీజ్ అయితే తమ సినిమాల‌ని వ‌రుస‌గా థియేట‌ర్ల‌లోకి దించేయాల‌ని చాలా మంది ప్రొడ్యూస‌ర్లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అంతా త‌మ సినిమా రిలీజ్‌ల‌ని వాయిదా వేసుకుంటూ వ‌స్తోంది పాన్ ఇండియా మూవీ `పెద్ది` కోస‌మే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ సినిమా మార్చి నెల నుంచి వ‌రుస‌గా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` కోసం మార్చి 27న రిలీజ్ చేయాల‌నుకున్న ఈ మూవీని ఫ‌స్ట్ టైమ్ మేక‌ర్స్ వాయిదా వేశారు. ఆ త‌రువాత ఏప్రిల్ 30న వ‌చ్చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అది కూడా క‌ష్ట‌మ‌ని ఆ రిలీజ్ డేట్ కూడా మారి సినిమా జూన్ 25న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

దీంతో చిన్న సినిమాల రిలీజ్ చేయాల‌ని ఎదురు చూస్తున్న నిర్మాత‌ల‌కు `పెద్ది` రిలీజ్ డేట్ ఓ నాన్నా పులి ఆట‌లా మారింది. కొంత మంది `పెద్ది` ఎప్పుడు రిలీజ్ అయితే ఆ త‌రువాతే త‌మ సినిమాల‌ని రిలీజ్ చేద్దామ‌ని కూర్చుంటే మ‌రి కొంత మంది మాత్రం `పెద్ది` రిలీజ్ డేట్ మారింద‌ని ప‌క్కా స‌మాచారంతో త‌మ ప్రాజెక్ట్‌ల‌ని థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చేస్తున్నారు. అయితే ఫైన‌ల్‌గా `పెద్ది` రిలీజ్ డేట్‌ని శుక్ర‌వారం మేక‌ర్స్ జూన్ 4న రిలీజ్ చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో చాలా వ‌ర‌కు చిన్న సినిమాలు మే నెల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి.

ఇప్ప‌టికే జెట్‌లీ, గాయ‌ప‌డ్డ సింహం` థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేయ‌డంతో జూన్ 4 లోపు మ‌రిన్ని చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డికి రెడీ అవుతున్నాయి. ఇందులో ర‌విబాబు న‌టించి డైరెక్ట్ చేసిన `రేజ‌ర్‌` కూడా ఒక‌టి. ఈ సినిమాని మే 8న రిలీజ్ చేస్తున్నారు. అయితే `పెద్ది` రిలీజ్ డేట్‌లు మార‌డంతో ర‌విబాబు ఇబ్బందులు ప‌డ్డార‌ట‌. ఇదే విష‌యాన్ని ఓ పోడ్ కాస్ట్‌లో బ‌య‌ట‌పెట్టారు. ముందు నుంచే మే 1న `రేజ‌ర్‌`ని రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే పెద్ద సినిమా (పెద్ది) వ‌చ్చేస్తోంద‌ని అంతా భ‌య‌పెట్ట‌డం మొద‌లు పెట్టారు. మార్కెట్ అంతా హ‌డావిడి చేశారు.

పెద్ద సినిమాల‌న్నీ ఇంతే వాళ్లు ఒక డేట్ చెబుతారు అవి అనుకున్న డేట్‌కు రావు. ఇదే స‌మ‌య‌లో చిన్న సినిమాల‌న్నీ ఎప్పుడు రిలీజ్ చేయాలో ఏంటో ఎవ‌రికీ తెలియ‌క అంతా కంగారు ప‌డుతూ వుంటారు. ఈ ప‌రిస్థితిని నేను చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాను. `పెద్ది` రిలీజ్ అవుతోంద‌న‌గానే పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది అని ఆలోచిస్తున్న‌ప్పుడు స‌డ‌న్‌గా అది రావ‌డం లేద‌న్నారు. ఆ త‌రువాత మ‌ళ్లీ వ‌స్తోంద‌న్నారు. ఇలా ఓ ప‌దిహేను రోజులు యోయో అనేట్టుగా జ‌రిగింది. దాంతో మ‌న‌కు ఈ టెన్ష‌న్ వ‌ద్దులేరా అనుకుని మ‌న‌కు అనువుగా ఏం డేట్స్ ఉన్నాయి అని ఆరాతీస్తే 8, 15 ఉంది అన్నారు. 8నే రిలీజ్ చేయాల‌ని ఎందుకు అనుకున్నాను అంటే మే 8న మా ఫాద‌ర్ (చ‌ల‌తిరావు) బ‌ర్త్‌డే` అన్నారు ర‌విబాబు.

Tags:    

Similar News