ఈగో పక్కనపెట్టిన బుచ్చిబాబు.. పెద్ది సీన్ల కట్ వెనుక అసలు కథ!

రామ్ చరణ్ సినిమా పెద్ది బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, సినిమాలోని కొన్ని సీన్స్ మహిళలను కాస్త ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Update: 2026-06-06 05:31 GMT

రామ్ చరణ్ సినిమా పెద్ది బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, సినిమాలోని కొన్ని సీన్స్ మహిళలను కాస్త ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఫీడ్ బ్యాక్ పై డైరెక్టర్ బుచ్చిబాబు వెంటనే రియాక్ట్ అయ్యాడు. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అని లైట్ తీసుకోకుండా, పబ్లిక్ రియాక్షన్స్ ను గౌరవిస్తూ ఆ సీన్లను కట్ చేస్తున్నట్లు ఒక క్లారిటీ ఇచ్చాడు. సినిమా నిడివి ఇప్పటికే 3 గంటలు ఉంది. అయితే ఎక్కువగా దర్శకులు సీన్స్ కట్ చేయడానికి ఇబ్బంది పడతారు. కానీ బుచ్చిబాబు ఈగో కి పోకుండా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

సినిమా అనేది జనాలను ఎంటర్టైన్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి కానీ ఎవరినీ అసౌకర్యానికి గురి చేయకూడదని బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. పెద్ది సినిమాలో కొన్ని సీన్ల గురించి వస్తున్న కామెంట్స్ ను తాము చాలా సీరియస్ గా తీసుకున్నట్లు చెప్పాడు. తెర మీదైనా, నిజ జీవితంలో అయినా మహిళల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఏ ఒక్క ఫీమేల్ క్యారెక్టర్ ను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం తమకు అస్సలు లేదని అన్నాడు.

ఒకవేళ థియేటర్లలో ఆ సీన్స్ చూసినప్పుడు ఎవరికైనా అలా నెగిటివ్ గా అనిపిస్తే, వాళ్ల ఫీలింగ్స్ కు తాను వంద శాతం విలువ ఇస్తున్నట్లు డైరెక్టర్ చెప్పాడు. ఆడియన్స్ కన్సన్స్ ను అర్థం చేసుకుని చాలా సిన్సియర్ గా క్షమాపణలు కోరాడు. అంతేకాకుండా, ఆ వివాదాస్పద భాగాలను వెంటనే ఎడిట్ చేసి మార్చాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. మారుతున్న జనాల ఆలోచనలకు, వాళ్ల సున్నితత్వానికి తగ్గట్టుగా కథలు చెప్పాల్సిన బాధ్యత మేకర్స్ పై ఉందనే వాస్తవాన్ని ధైర్యంగా అంగీకరించాడు.

సొసైటీలో ప్రతి మహిళకూ తగిన గౌరవం, విలువ దక్కాలని తాను ఎప్పుడూ నమ్ముతామని బుచ్చిబాబు తన పోస్ట్ లో వెల్లడించాడు. ఎప్పటికీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ను సెలబ్రేట్ చేసుకునేలా కథలు చెప్పేందుకు తమ టీమ్ కట్టుబడి ఉంటుందని ప్రామిస్ చేశాడు. పెద్ది సినిమాపై తమ అభిప్రాయాలను చాలా నిజాయితీగా పంచుకుని, ఈ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు.

ఒక పెద్ద సినిమా విషయంలో జనాల ఫీడ్ బ్యాక్ తీసుకుని ఇలా సెన్సిబుల్ గా ఆలోచించి మార్పులు చేయడం మంచి విషయమే. ప్రెజెంట్ బాక్సాఫీస్ దగ్గర పెద్దికి వేరే పెద్ద సినిమాల పోటీ లేదు. ఈ సీన్ల కట్ తో నెగిటివిటీ పూర్తిగా తగ్గి, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చేందుకు ఇది బాగా ప్లస్ అవుతుంది. ముఖ్యంగా వచ్చే వారం స్కూల్స్ తెరిచే లోపు ఫ్యామిలీస్ అంతా కలిసి సినిమా చూసేందుకు మేకర్స్ వేసిన ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ కచ్చితంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది.



Tags:    

Similar News