పెద్ది చూసి వెంటనే బయటకు రాలేరు.. క్లైమాక్స్‌పై బుచ్చిబాబు సెన్సేషనల్ కామెంట్స్!

పెద్ది సినిమా పూర్తిగా ఎమోషన్స్‌పై నడిచే కథ అని బుచ్చిబాబు వెల్లడించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ఈ కథ యొక్క అసలు బలం ఎమోష‌న్సే అని బుచ్చి క్లారిటీ ఇచ్చారు.

Update: 2026-05-16 06:25 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్దిపై రోజురోజుకీ అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. ఉప్పెన తర్వాత డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సాన అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా గురించి తాజాగా బయటకు వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల‌వుతున్నాయి. ముఖ్యంగా బుచ్చిబాబు చెప్పిన కొన్ని ఎమోషనల్ పాయింట్లు సినీ అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

పెద్ది సినిమా ఆఖ‌రి 45-50 నిమిషాలు చూస్తుంటే గుండె బరువెక్కుతుందంటూ బుచ్చి చెప్పిన మాటలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చరణ్ నటన గురించి మాట్లాడుతూ ఆయన ముఖంలో ఒక నిజాయితీ ఉంటుంద‌ని, అదే పెద్ది పాత్రకు ప్రాణం పోసింద‌ని బుచ్చిబాబు చెప్పారు. ఆ నిజాయితీ కారణంగానే గతంలో ఆర్ఆర్ఆర్, రంగ‌స్థ‌లం లాంటి సినిమాల్లో చరణ్ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.

పెద్ది సినిమా పూర్తిగా ఎమోషన్స్‌పై నడిచే కథ అని బుచ్చిబాబు వెల్లడించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ఈ కథ యొక్క అసలు బలం ఎమోష‌న్సే అని బుచ్చి క్లారిటీ ఇచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయ‌ని, ముఖ్యంగా ఆఖరి 50 నిమిషాలు చాలా హై ఎమోషనల్ జోన్‌లో సాగుతాయ‌ని, అదే సమయంలో కథ చాలా రియలిస్టిక్‌గా కూడా ఉంటుంద‌ని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో డైరెక్ట‌ర్ ఇచ్చిన హింట్స్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తున్నాయి.

సినిమాలో ఎక్కడా రామ్ చరణ్ కనిపించడ‌ని, పెద్ది పాత్ర మాత్రమే కనిపిస్తుంద‌ని చెప్పడం ద్వారా ఈ సినిమాలో చరణ్ పూర్తిగా పాత్రలో లీనమయ్యాడని అర్థమవుతోంది. గతంలో రంగస్థలంలో చిట్టిబాబు పాత్రతో ప్రేక్షకులను ఎమోష‌న‌ల్ చేసిన చరణ్, ఇప్పుడు పెద్దితో మరింత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడని బుచ్చి మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. సినిమా అయిపోయాక కూడా ఆడియ‌న్స్ కథ నుంచి వెంటనే బయటకు రాలేరని, ఆడియన్స్ చాలా డిస్ట్రబ్ అవుతార‌ని, డిస్ట్ర‌బ్ అయిన‌ప్ప‌టికీ, మళ్లీ ఈ కథతో ట్రావెల్ చేయాలనినిపిస్తుంద‌ని బుచ్చి చెప్ప‌డం చూస్తుంటే పెద్దిలో ఎమోష‌న‌ల్ సీన్స్ బాగా వ‌ర్కవుట్ అయ్యాయ‌ని అనిపిస్తోంది.

భారీ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా యాక్షన్, విజువల్స్ మీద ఆధారపడుతున్న వేళ‌, పెద్ది మాత్రం పూర్తిగా ఎమోషన్‌ను కోర్ పాయింట్‌గా తెరకెక్కి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్లతో భారీ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు బుచ్చిబాబు కామెంట్స్ తో మరింత హైప్‌ను సంపాదించింది. ముఖ్యంగా చరణ్ కెరీర్‌లో మరో రంగస్థలం తరహా పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూడబోతున్నామనే నమ్మకం అభిమానుల్లో బలపడుతోంది.

Tags:    

Similar News