ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్.. మరి పెద్ది?
రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోందనే చర్చ ట్రేడ్ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది.
రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోందనే చర్చ ట్రేడ్ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో ఆల్రెడీ మిలియన్ డాలర్ల మార్క్ దాటేయడం, తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు ఉండటంతో మొదటి రోజు వసూళ్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ 10 ఫస్ట్ డే గ్రాస్ ఓపెనింగ్స్ లిస్టులో చరణ్ సినిమా ఏ స్థానంలో నిలుస్తుంది, ఎవరి రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత బాక్సాఫీస్ లెక్కల అంచనాల ప్రకారం ఓపెనింగ్ డే వసూళ్లలో 'పుష్ప 2' 285 కోట్లతో టాప్ లో ఉండగా, RRR, బాహుబలి 2 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ భారీ నంబర్స్ ను అందుకోవడం పెద్ది సినిమాకు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ చిత్రాలన్నీ కాంబినేషన్ అంటూ పక్కా పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన హైప్ తో వచ్చినవి.
అంచనాల ప్రకారం టాలీవుడ్ లో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్
1. పుష్ప 2 ది రూల్: రూ.285.55 కోట్లు
2. RRR: రూ.235 కోట్లు
3. బాహుబలి 2: రూ.215 కోట్లు
4. కల్కి 2898 AD: రూ.183.20 కోట్లు
5. సలార్: రూ.167 కోట్లు
6. దేవర పార్ట్ 1: రూ.157 కోట్లు
7. OG: రూ.145.00 కోట్లు
8. ఆదిపురుష్: రూ.137 కోట్లు
9. సాహో: రూ.126 కోట్లు
10. ది రాజా సాబ్: రూ.101.80 కోట్లు
ఇక పెద్ది మూవీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, చరణ్ కు ఉన్న గ్లోబల్ ఇమేజ్ తో పాటు ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో కనిపిస్తున్న స్పీడ్. దీనివల్ల మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఈ చిత్రం సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ట్రేడ్ సర్కిల్స్ అంచనాల ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే సులభంగా వంద కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉంది. అదే గనుక జరిగితే ప్రభాస్ 'రాజా సాబ్' లేదా 'సాహో' కలెక్షన్స్ ను దాటుకుని టాప్ 10 లిస్టులోకి పెద్ది ఎంట్రీ ఇవ్వడం ఖాయం.
ముఖ్యంగా నైజాం, ఆంధ్రా ఏరియాల్లో ఉన్న క్రేజ్ కి తోడు హిందీ బెల్ట్ లో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తే ఈ సినిమా ఏకంగా ఆదిపురుష్, దేవర చిత్రాల రికార్డులకు కూడా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మాస్ ఎమోషన్స్ గనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర కొత్త లెక్కలు మొదలవుతాయి. అయితే ఈ రికార్డుల రేసులో నిలబడాలంటే సినిమా కంటెంట్ లో దమ్ముండటం చాలా ముఖ్యం. నిడివి కూడా 3 గంటల పైనే ఉంది కాబట్టి, కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగాలి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తో మొదటి రోజు సగం కలెక్షన్స్ సేఫ్ అయినా, మిగతా సగం వసూళ్లు మార్నింగ్ షో టాక్ మీద ఆధారపడి ఉంటాయి.