రూటు మార్చి గ్రౌండ్‌లో దిగుతున్న టాలీవుడ్‌...!

మెగా హీరో వరణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఒక స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. ఈయన గతంలో స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాను చేయడం జరిగింది.;

Update: 2026-03-27 06:38 GMT

టాలీవుడ్‌ అయినా మరే సినిమా ఇండస్ట్రీ అయినా ఒకానొక సమయంలో ఒక ట్రెండ్‌ను ఫాలో కావడం మనం చూస్తూ ఉంటాం. ఒకసారి బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగితే, ఒక సారి యాక్షన్ సినిమాల ట్రెండ్‌ నడుస్తూ ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఒకానొక సమయంలో ఫ్యాక్షన్‌ సినిమాల ట్రెండ్‌ నడిచింది, ఆ తర్వాత ఫ్యామిలీ సినిమాలు, యాక్షన్‌, కామెడీ, సీక్వెల్స్‌ ట్రెండ్‌ ను చూశాం. ఒక సినిమా హిట్‌ అయితే ఆ ఫార్ములాతో సినిమాలను తీయడం ఇండస్ట్రీలో చాలా కామన్‌ విషయం. సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్‌ మారడం అనేది చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు సీక్వెల్స్ ట్రెండ్‌ చూసిన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌ను చూసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అర డజనుకు పైగా చిన్నా పెద్ద స్పోర్ట్స్ డ్రామాలు రూపొందుతున్నాయి. హీరోలు వివిధ ఆటలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు...

బాలీవుడ్‌లో గతంలో చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కానీ టాలీవుడ్‌లో స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఆ లోటు భర్తీ కాబోతుంది. టాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలను ఆధరిస్తున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి కంటెంట్‌తో స్పోర్ట్స్ డ్రామాలను తీసుకు వచ్చేందుకు గాను ఫిల్మ్‌ మేకర్స్ రెడీ అవుతున్నారు. అలాగే హీరోలు సైతం రెడీగా ఉన్నారు. ఈ జాబితాలో మొదట వచ్చే అతి పెద్ద స్పోర్ట్స్ డ్రామా విషయానికి వస్తే రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా. ఈ సినిమాలో రామ్‌ చరణ్ ఆటగాడు అనే విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆయన క్రికెట్‌ ఆడుతున్న విధానంకు ఏకంగా ప్రముఖ క్రికెటర్స్ కూడా ఫిదా అవుతున్నారు. అందుకే పెద్ది సినిమా కోసం స్పోర్ట్స్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పెద్దితో రామ్‌ చరణ్ ఆటగాడిగా....

రామ్‌ చరణ్‌ పెద్దితో పాటు ఆయన మిత్రుడు శర్వానంద్‌ సైతం ఒక స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. శర్వానంద్‌ బైకర్‌ గా కనిపించబోతున్నాడు. బైకర్‌ సినిమాలో శర్వానంద్‌ ను చాలా విభిన్నంగా చూడబోతున్నాం. ఆయన లుక్‌ తో పాటు సినిమా కాన్సెప్ట్‌ చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ ఇప్పటికే మేకర్స్ పదే పదే చెబుతున్నారు. ఇక బైకర్‌ సినిమాలో రాజశేఖర్‌ సైతం ఉండటం వల్ల అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. రేసింగ్‌ రేపథ్యంలో రాబోతున్న మొదటి తెలుగు సినిమాగా దీన్ని చెబుతున్నారు. శర్వానంద్‌ కు ఈ సినిమా సక్సెస్‌ అత్యంత కీలకం. కనుక ఈ సినిమా ఫలితంపై ఆయన చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఇక టైసన్ నాయుడు అనే టైటిల్‌ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు, కానీ సినిమాలో బెల్లంకొండ బాబు బాక్సర్‌ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రాబోతుంది.

సూర్య 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' సినిమా....

మెగా హీరో వరణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఒక స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. ఈయన గతంలో స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాను చేయడం జరిగింది. కానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. వాలీబాల్‌ నేపథ్యంలో వరుణ్‌ తేజ్ మూవీ ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇక తమిళ స్టార్‌ హీరో సూర్య తో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న సినిమా 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' సినిమా సైతం స్పోర్ట్స్ నేపథ్యం అనే వార్తలు వస్తున్నాయి. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా మేకర్స్‌ నుంచి ప్రమోషనల్‌ ప్రకటనలు వచ్చాయి. ఈ సినిమాలు కాకుండా మరికొన్ని చిన్న సినిమాలు సైతం స్పోర్ట్స్ నేపథ్యంతో రాబోతున్నాయి. ఈ ఏడాదిలో మొత్తంగా అరడజనుకు తగ్గకుండా స్పోర్ట్స్ డ్రామా సినిమాలు రాబోతున్నాయి.

Tags:    

Similar News