• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ కోసం.. రంగంలోకి...

ప్రభాస్ కోసం.. రంగంలోకి బోల్డ్ బ్యూటీ

| ఆర్ఎక్స్100, మంగళవారం సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరియర్ లీడ్ చేస్తోన్న అందాల భామ పాయల్ రాజ్ పుత్.

By - Tupaki Desk
Update: 2024-08-23 11:21 GMT

ఆర్ఎక్స్100, మంగళవారం సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరియర్ లీడ్ చేస్తోన్న అందాల భామ పాయల్ రాజ్ పుత్. తెలుగు సినిమాలతో పాటు మాతృభాష పంజాబీలో మూవీస్ చేస్తూ వస్తోంది. అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తమిళంలో గోల్ మాల్, ఏంజిల్ అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగులో కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే తెలుగు ప్రేక్షకులకి ఈ బ్యూటీ ఇప్పటికే చేరువ అయ్యింది. తెలుగు నటిగానే పాయల్ రాజ్ పుత్ ని అందరూ గుర్తిస్తారు. తాజాగా పాయల్ రాజ్ పుత్ అర్షద్ వార్సీ కల్కి సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ పై చేసిన జోకర్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యింది. ఇప్పటికే సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. సుధీర్ బాబు, సిద్దు జొన్నలగడ్డ, అభిషేక్ అగర్వాల్ అర్షద్ వార్సీకి కౌంటర్ ఇచ్చారు.

నాని కూడా అర్షద్ పై విమర్శలు చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అర్షద్ మంచి నటుడు అంటూ కితాబు ఇచ్చారు. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నారు. తాజాగా మంచు విష్ణు కూడా మా ప్రెసిడెంట్ గా అర్షద్ వార్సీ వ్యాఖ్యలని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. ఇదిలా ఉంటే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ట్విట్టర్ లో అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై కౌంటర్ వేసింది. కల్కిలో భైరవ పాత్రని 2898వ సంవత్సరంలో వచ్చిన కూడా నువ్వు మ్యాచ్ చేయలేవు సర్క్యూట్… నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో అంటూ అర్షద్ వార్సీ మున్నాభాయ్ MBBS సినిమాలో చేసిన పాత్రని రిఫరెన్స్ గా చూపిస్తూ పాయల్ రాజ్ పుత్ కామెంట్స్ చేసింది.

దయచేసి మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోండి అంటూ పాయల్ రాజ్ పుత్ తన కామెంట్స్ ని అర్షద్ వార్సీకి ట్యాగ్ చేసింది. ఈ వ్యాఖ్యలపై డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ కి సపోర్ట్ గా నిలబడినందుకు పాయల్ రాజ్ పుత్ కి థాంక్స్ చెబుతున్నారు. మరో వైపు బాలీవుడ్ సినీ అభిమానులు మాత్రం పాయల్ రాజ్ పుత్ ఈ మ్యాటర్ పై రియాక్ట్ అయ్యి అటెన్షన్ గ్రాబ్ చేసుకుంటుందంటూ విమర్శించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్షద్ వార్సీ మున్నాభాయ్ MBBS లో చేసిన సర్క్యూట్ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తూ తెలుగు స్టార్ హీరోలపై బాలీవుడ్ సినీ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్ ఫ్యాన్స్ బాలీవుడ్ సినిమాలపైనే కాకుండా అర్షద్ వార్సీపైన కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సౌత్ అండ్ నార్త్ ఫ్యాన్స్ వార్ గా మారిపోయింది.

"#Circuit will never match up to #Kalki, even in 2898 AD “ @ArshadWarsi please take your words back . #fangirl #rebelfans #Prabhas #darlings

— paayal rajput (@starlingpayal) August 22, 2024
Tags:    
  • Payalrajput 
  • Actress 
  • Filmindustry 
  • Prabhas 
  • kalki 
  • Kalki2898AD 
  • Arshadwarsi 
  • Rajasaab 
  • Salaar2 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS