గ్లామర్‌తో స్టైల్ కలబోత.. పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ లుక్ వైరల్

ముఖ్యంగా ఒక ఫోటోలో కనబడిన తీరు తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. పాయల్ ఈ ఫొటోషూట్‌లో స్టైల్‌తో పాటు ఫన్ మూమెంట్స్‌ను కూడా కలిపింది.;

Update: 2025-04-15 17:55 GMT

టాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్, మళ్లీ తన స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫొటోషూట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. డార్క్ పర్పుల్ గౌన్‌లో, చక్కని మెటాలిక్ బెల్ట్‌తో, హెయిర్ స్టైలింగ్‌ను రెండు పికీటైల్స్‌లా మార్చి తనను ఒక డిఫరెంట్ గ్లామర్ లుక్‌లో చూపించింది.

 

ముఖ్యంగా ఒక ఫోటోలో కనబడిన తీరు తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. పాయల్ ఈ ఫొటోషూట్‌లో స్టైల్‌తో పాటు ఫన్ మూమెంట్స్‌ను కూడా కలిపింది. ఒకవైపు బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకోగా, మరోవైపు చిరునవ్వుతో ఫోటోలకే కొత్త స్పార్క్ ఇచ్చింది. "మీ హృదయం ఎల్లప్పుడూ మిమ్మల్ని నడిపించనివ్వండి" అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోషూట్‌లో ఉన్న భావోద్వేగాన్ని చెప్పకనే చెప్పింది.

 

పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌ను పరిశీలిస్తే.. పంజాబీ చిత్రాలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, ‘RX100’తో తెలుగులో బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తరువాత ఆమెను గ్లామర్ బ్యూటీగా చూడటం మొదలుపెట్టారు. 'వెంకీ మామ', 'డిస్కోరాజా', వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి మార్క్ ఏర్పరచుకుంది. కానీ కొంతకాలంగా మంచి హిట్ లేకపోవడంతో వెబ్ సిరీస్‌లు, గ్లామర్ ఫొటోషూట్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోంది.

చివరగా ఆమె ‘మంగళవారం’ అనే థ్రిల్లర్‌లో కనిపించింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. ఆమె పెర్ఫార్మెన్స్ పట్ల మాత్రం ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం పాయల్ మరికొన్ని వెబ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ ఓ మాస్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ మధ్య పాయల్ పోస్ట్ చేసే ఫోటోలు, క్యాప్షన్లు, క్యాజువల్ బొల్డ్ స్టైల్.. వాటన్నిటిలోనూ ఆమె తన అస్తిత్వాన్ని, భావప్రదర్శనను స్పష్టంగా చూపిస్తోంది. ఈ లేటెస్ట్ ఫొటోసెషన్ చూస్తే, పాయల్ గ్లామర్ గేమ్‌ను మరింత హై స్టాండర్డ్‌కు తీసుకెళ్లే దిశగా ఉందని చెప్పవచ్చు.

Tags:    

Similar News