• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోడీతో పవన్ కొడుకు.....

మోడీతో పవన్ కొడుకు.. వ్వాటే టైమింగ్!

| అసలు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో సక్సెస్ అవుతారు అని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు.

By - Tupaki Desk
Update: 2024-06-06 10:44 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అని చాలామంది అభిమానులు కోరుకున్నారు. కానీ ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 100% సక్సెస్ రిజల్ట్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా ఆయన అభిమానుల కంటే ప్రత్యర్థులకే పెద్ద షాక్ అని చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో సక్సెస్ అవుతారు అని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు.


ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ తప్పకుండా ఈసారి అన్ని స్థానలలోనూ గెలుస్తామని చెప్పడంతో ఏదో అనుకున్నారు. కానీ అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీ కుంభస్థలాన్ని కొట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వారసుడు గట్టిగా వైరల్ అవుతూ ఉండడం ఫాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు.

అతను తన తండ్రితో ఎక్కడ కనిపించినా కూడా ఫాన్స్ అయితే బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా అతను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది అని అందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక కటౌట్ కూడా తండ్రికి తగ్గట్టుగా ఉండడంతో తప్పకుండా సినిమాల్లో రానిస్తాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.

అయితే ఈ ఎన్నికలతో అకిరానందన్ రేంజ్ కూడా మరొక్కసారి పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా అతను మోడీతో కనిపించడంతో పర్ఫెక్ట్ టైంలో అతను బాహ్య ప్రపంచంలో వైరల్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇన్ని రోజులు కొడుకును ఎప్పుడు కూడా పవన్ పాలిటిక్స్ కు సంబంధించిన విషయాలలో అడుగు కూడా పడనివ్వలేదు. తండ్రికి సపోర్ట్ గా ఉండాలి అని అకిరా చాలా సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఆ విషయంలో పవన్ మాత్రం రిస్క్ తీసుకోలేదు.

కానీ ఇప్పుడు సక్సెస్ అందడంతో కొడుకుని అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా చంద్రబాబుతో పరిచయం చేయించిన పవన్ కళ్యాణ్ ని ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొమ్మని చెప్పాడు. ఇక ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ దగ్గరికి వెళ్లి తన కొడుకును నిలబెట్టాడు. ఇక ప్రస్తుతం అకిరా ఫోటోలు అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కాబోయే జూనియర్ పవర్ స్టార్ కు ఇది సరైన ఆరంభం అని చెప్పవచ్చు.

ఈ టైంలో గనక అతన్ని సినిమాల్లోకి తీసుకు వస్తే ఊహించిన రెస్పాన్స్ వస్తుంది అనే మాట వినిపిస్తోంది. ఇక అకిరా ఇష్టపడితే అతన్నీ హీరోగా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కూడా ఆయన తల్లి రేణు దేశాయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా అడ్డు చెప్పకపోవచ్చు. ఎలాగూ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటే సినిమాలు చేయకపోవచ్చు. ఇక ఫ్యాన్స్ కు ఆ వెళితేని జూనియర్ పవర్ స్టార్ తీర్చే అవకాశం ఉంటుంది. మరి జూనియర్ పవర్ స్టార్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో కాలమే సమాధానం ఇవ్వాలి.

Tags:    
  • Tollywood 
  • FilmIndustry 
  • Pawankalyan 
  • Jsp 
  • PithapuramMla 
  • Bjp 
  • Tdp 
  • NarendraModi 
  • AkiraNandan 
  • AnnaLezhneva 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS