• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG: నో బర్త్ డే...

OG: నో బర్త్ డే అప్డేట్స్… రీజన్ ఏంటంటే?

| అయితే ఊహించని విధంగా ఈ అప్డేట్ క్యాన్సిల్ అయ్యింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ దీనిపై మరో ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-09-02 05:56 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని సెప్టెంబర్ 2న OG మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావించింది. దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ఉండబోతోందని డివివి ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ఎనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ అప్డేట్ కోసం ఎగ్జైట్ గా ఎదురుచూసారు. OG మూవీ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని భావించారు.

అయితే ఊహించని విధంగా ఈ అప్డేట్ క్యాన్సిల్ అయ్యింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ దీనిపై మరో ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో తుఫాన్, వరదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రావాల్సిన OG అప్డేట్స్ ని క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించారు. వరదల ప్రభావాన్ని అందరం కలిసి అధికమించి తర్వాత అదిరిపోయే అప్డేట్స్ తో సెలబ్రేషన్స్ చేసుకుందాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో OG మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కి నిరాశ చెందారు.

నిజానికి అప్డేట్స్ అన్ని క్యాన్సిల్ చేయాలని మేకర్స్ కి పవన్ కళ్యాణ్ సూచించారంట. తుఫాన్, వరదల సమయంలో ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని సూచించారంట. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేకర్స్ కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వరదల ప్రభావం తగ్గిన తర్వాత మంచి టైం చూసుకొని అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. త్వరలో విశాఖపట్నంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమా కోసం గ్రీన్ మ్యాట్ ఫ్లోర్ తో పాటు, కొన్ని సెట్ వర్క్స్ కూడా విశాఖలో రెడీ చేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ కి సంబందించిన పెండింగ్ సన్నివేశాలు అన్ని కూడా విశాఖపట్నంలోనే పూర్తి చేయడానికి సుజిత్ రెడీ అవుతున్నారంట. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి సుజిత్ సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ బర్త్ సందర్భంగా OGతో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి ఏదో ఒక సర్ ప్రైజ్ అప్డేట్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్న తుఫాన్, వరదల కారణంగా అన్నింటిని క్యాన్సిల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్ గా గబ్బర్ సింగ్ మూవీని మాత్రమే రీరిలీజ్ చేస్తున్నారు.

Due to the continuous rain and flood calamities in Andhra Pradesh and Telangana, we have decided to call off all birthday content releases tomorrow.

𝑶𝑮 is a film that will be celebrated for years to come ❤️

Let’s get through this together and celebrate in a big way soon. 🤗

— DVV Entertainment (@DVVMovies) September 1, 2024
Tags:    
  • Pawankalyan 
  • OG 
  • DVV 
  • Danayya 
  • Sujeeth 
  • Birthdaypawankalyan 
  • Janasena 
  • Deputychiefminister 

Similar News

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

Copyright @2026

Powered by Blink CMS