• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సురేందర్ రెడ్డితో పవన్...

సురేందర్ రెడ్డితో పవన్ సినిమా సంగతేంటి? జరిగే పనేనా?

| అయితే మూడు సినిమాలు అయ్యాక.. పవన్ కొత్త చిత్రాలను ఒప్పుకుంటారా? నటిస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్.

By - Tupaki Desk
Update: 2025-06-15 19:30 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొద్ది రోజులుగా తాను ఇప్పటికే సైన్ చేసిన సినిమాలు చకచకా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత హరిహర వీరమల్లు మూవీని పూర్తి చేసిన పవన్.. ఆ వెంటనే ఓజీని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా.

అయితే మూడు సినిమాలు అయ్యాక.. పవన్ కొత్త చిత్రాలను ఒప్పుకుంటారా? నటిస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకు ఆ విషయంపై పవర్ స్టార్ ఎక్కడా స్పందించలేదు.. ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ సముద్రఖని దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తారని మాత్రం కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే సినీ ప్రియులకు ఆనందమే. కానీ జరుగుతుందో లేదో తెలియదు. అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే.. 2023లో దర్శకుడు సురేందర్ రెడ్డి.. పవన్ తో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్టుకు రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. పూజా కార్యక్రమాలు కూడా చేశారు. కానీ సినిమా మాత్రం స్టార్ట్ అవ్వలేదు.

ఆ తర్వాత ఓసారి నిర్మాత స్పందించి.. పవన్ కు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ బాగా నచ్చిందని చెప్పారు. కానీ సినిమా తీసేందుకు సమయం లేకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చిన అడ్వాన్స్ ను వెనక్కి తీసుకోలేదని తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లి బిజీగా మారిన పవన్.. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ నే పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారు.

దీంతో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ మరి స్టార్ట్ అవ్వలేదు. అలా ఆ సినిమా రద్దు అవుతుందని అంతా అనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం ఆశతో ఉన్నారని ఇప్పుడు తెలుస్తోంది. నిర్మాత రామ్ తాళ్లూరి, పవన్ సాన్నిహిత్యంగా ఉంటారు కాబట్టి.. తన మూవీని పవర్ మొదలుపెడతారని ఆయన అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ రాబోయే కొన్ని నెలల్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్‌ ను పూర్తి చేసి, తన ప్రాజెక్ట్ కోసం తేదీలు కేటాయించాలని సురేందర్ రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ఉస్తాద్ షూటింగ్ ఎక్కువే ఉంది. ఓజీ డబ్బింగ్ ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పటికే రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్ కూడా ఆ పనులు పెండింగ్ ఉంటాయి. మరి పవన్.. సురేందర్ రెడ్డికి డేట్స్ ఇస్తారో లేదో.. సినిమా చేస్తారో లేదో.. ఆయన ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

Tags:    
  • PawanKalyan 
  • SurenderReddy 
  • UstaadBhagatSingh 
  • OGMovie 
  • HariHaraVeeraMallu 
  • TollywoodUpdates 
  • PowerStar 
  • PawanKalyanFans 
  • RamTalluri 
  • Filmindustry 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS