400 మందితో పవన్ మాస్ స్టెప్పులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ ఆల్రెడీ ఒప్పుకున్న కమిట్‌మెంట్స్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ ఆల్రెడీ ఒప్పుకున్న కమిట్‌మెంట్స్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన పవన్ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన నటించిన ఓజి సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఓజి
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ ఓజి పనుల్ని పూర్తి చేసేసిన పవన్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరి కలయికలో గతంలో గబ్బర్‌సింగ్ రాగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఉస్తాద్ భగత్‌సింగ్‌పై మంచి అంచనాలు
గబ్బర్ సింగ్ తర్వాత పవన్- హరీష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్‌సింగ్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు హరీష్ శంకర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ప్రస్తుతం 400 మంది డ్యాన్సర్లతో ఓ సాంగ్ ను తెరకెక్కిస్తోందట చిత్ర యూనిట్.
చాలా రోజుల తర్వాత దేవీ ట్యూన్ కు పవన్ స్టెప్పులు
చాలా రోజుల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సాంగ్ కు స్టెప్పులేస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సాంగ్ గురించే సైమాలో దేవీ శ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను కంపోజ్ చేసిన సాంగ్ విని పవన్ షేక్ హ్యాండ్ ఇచ్చి, సాంగ్ వింటేనే డ్యాన్స్ చేయాలనిపిస్తుందన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.