పవన్ మార్క్ అంటే ఇలా ఉంటుంది మరి!
పవన్ కళ్యాణ్.. ఆయనకు ఉన్న క్రేజే వేరు. రాజకీయాల్లో వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.;
పవన్ కళ్యాణ్.. ఆయనకు ఉన్న క్రేజే వేరు. రాజకీయాల్లో వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే.. తన మార్క్ పాలన చూపించారు. అనేక విషయాలపై ఆరా తీశారు.
ఇప్పుడు రీసెంట్ గా సినిమాల విషయంలో కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. థియేటర్స్ లో తనిఖీలు నిర్వహించాలని, తినుబండారాల క్వాలిటీ తోపాటు రేట్లపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు.. మూవీ టికెట్ రేట్లు, ఎక్స్ ట్రా షోల అనుమతులు కావాలంటే ఛాంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.
అది తన సినిమా అయినా.. అలాగే చేయాలని చెప్పారు. దాని ద్వారా క్లియర్ గా ఒక విషయం అర్థమయ్యేలా చేశారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తనకు కూడా వర్తిస్తాయని చెప్పారు. అదే సమయంలో ఇప్పుడు ఆయన.. హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 12వ తేదీన సినిమా రిలీజ్ కానుంది.
గ్యాప్ తర్వాత పవన్ స్క్రీన్ పై కనిపించనుండడంతో అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మిడ్ నైట్ షోస్ కూడా కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు పవన్.. అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో షోస్ వేసే విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అస్సలు వేయొద్దని మేకర్స్ కు చెబుతున్నారట.
ముఖ్యంగా రీసెంట్ గా ప్రీమియర్స్ షోలో జరిగిన విషయాలు గుర్తుంచుకుని పవన్ ఇప్పుడు అలా చేస్తున్నారని క్లియర్ గా తెలుస్తోంది. దీంతో పవన్ అన్ని విషయాల్లో మార్క్ చూపిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. అభిమానుల భద్రత గురించి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా, అర్ధరాత్రి ప్రదర్శనలకు అనుమతి లభించకపోతే, తెల్లవారుజామున 4 గంటల ప్రదర్శనలు వేయవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత రత్నం ఫిల్మ్ ఛాంబర్ తో ఆ విషయంపై చర్చించినట్లు సమాచారం. కానీ అభిమానులు మాత్రం ప్రీమియర్స్ ను డిమాండ్ చేస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.