పవర్ స్టార్ ఇంట్లో మళ్లీ జన్మలో కుక్కలా పుడతా!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ కూడా హీరో అన్న విషయం అందరికీ తెలిసిందే.;

Update: 2025-07-04 05:13 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ కూడా హీరో అన్న విషయం అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్న ఎంతోమందికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేశారు. ఇటీవల తెలుగు సినిమాల్లో ఒకప్పుడు పాకీజాగా పేరుగాంచిన తమిళ నటి వాసుకి.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని వెంటనే స్పందించారు.

పాకీజాకు రూ.2 లక్షలు సాయం అందించారు పవన్. ఇటీవల మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు అందజేశారు. అయితే పవన్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. భావోద్వేగానికి కూడా లోనయ్యారు.

చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ కన్నీరు పెట్టుకున్నారు. తన ఆర్థిక పరిస్థితి గురించి ఇటీవలే పవన్ కల్యాణ్ కార్యాలయానికి తెలియజేశానని, వెంటనే స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. తాను పవన్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి పాకీజా ఎమోషనల్ అయ్యారు.

రీసెంట్ గా మరో ఇంటర్వ్యూలో పవన్ చేసిన సాయంపై మాట్లాడారు. తనకు మరో జన్మ ఉంటే పవర్ స్టార్ ఇంట్లో కుక్కగా పుడతానని భావోద్వేగానికి గురయ్యారు. మొన్న కాళ్లు పట్టుకుంటానని వెళ్తే, అప్పుడు లేరని అన్నారు. పవన్ తన బంగారమని కొనియాడారు. అయితే అదే ఇంటర్వ్యూలో నటి మిత్రా శర్మ రూ.50 వేల సాయం అందించారు.

కాగా, తమిళనాడుకు చెందిన పాకీజా, 1990ల్లో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు యాక్ట్ చేసిన అసెంబ్లీ రౌడీ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువయ్యారు. ఆ తర్వాత రౌడీ గారి పెళ్లాం, మామగారు, రౌడీ ఇన్‌ స్పెక్టర్, పెదరాయుడు, అబ్బాయి, అన్నమయ్య వంటి పలు సినిమాల్లో నటించారు.

వివిధ చిత్రాల్లో యాక్ట్ చేసిన తర్వాత ఏఐఏడీఎంకే పార్టీలో చేరి అధికార ప్రతినిధి స్థాయికి చేరారు. కానీ ఆ తర్వాతే ఆమె కష్టాలు మొదలయ్యాయి. ఆర్థికంగా దుస్థితికి చేరుకున్నారు. దీంతో ఆమె.. తనకు సహాయం చేయాలని వేడుకుంటూ కనిపించారు. ఆ నేపథ్యంలో పవన్ రూ.2 లక్షల సాయం అందించారు. ఆ తర్వాత పలువురు కూడా ముందుకొచ్చారు.

Tags:    

Similar News