• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రత్నం కోసం జీవితంలో...

రత్నం కోసం జీవితంలో తొలిసారి.. ఆయన మౌనమే..: పవన్ కళ్యాణ్

| టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్.. తన కెరీర్ లో సినిమాల పరంగా తొలిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.

By - Tupaki Desk
Update: 2025-07-21 09:51 GMT

టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్.. తన కెరీర్ లో సినిమాల పరంగా తొలిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తన అప్ కమింగ్ మూవీ హరిహర వీరమల్లు మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సందడి చేశారు. తాను వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కోసమే వచ్చానని తెలిపారు.

తన జీవితంలో సినిమా పరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి అని, మూవీలను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో తనకు తెలియదని చెప్పారు. సినిమా కోసం ఇంతలా అంతలా కష్టపడ్డామని చెప్పడం ఎబ్బెట్టుగా ఉంటుందని అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన ఫొటోలు కూడా పేపర్లో వేయలేదని గుర్తు చేసుకున్నారు.

అందుకే పబ్లిసిటీ లేకుండానే తాను నటించిన సినిమాలు రిలీజ్‌ అయ్యాయని చెప్పారు. ఒక చిత్రాన్ని తెరకెక్కించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలని, మన ఇండస్ట్రీకి పాన్‌ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి రత్నమని కొనియాడారు. ఆయన ఎంతో ముందుచూపు ఉన్న నిర్మాతగా పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు.

సినిమా కోసం ఎంతో నలిగిపోయారని, వీరమల్లు పూర్తవుతుందా లేదా అని అనుకున్నప్పుడు ఎం ఎం కీరవాణి ప్రాణం పోశారని చెప్పారు. కానీ ఒక్కోసారి డబ్బులు, సక్సెస్‌ కోసం కాదు ఇండస్ట్రీ బాగుకోరే వ్యక్తుల వెంట నిలవడం ఎంతో ముఖ్యమని అన్నారు. అందుకే ప్రత్యర్థులు తిడుతున్నా. తాను ప్రెస్ మీట్ కు వచ్చానని తెలిపారు.

నిర్మాత రత్నం నలిగిపోతుంటే చాలా బాధ కలిగిందని అన్నారు. సినిమా చాలాసార్లు ఆలస్యం అయినప్పటికీ ఎన్నో మాటలు వచ్చినా ఆయన మౌనంగా ఉన్నారని తెలిపారు. చాలా మంది ట్రోల్స్ చేసినా.. రత్నం గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. అప్పుడు ఆయన మౌనంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

రత్నం మౌనమే ఇక్కడికి తనను రప్పించిందని, ఆయన కోసమే చెప్పేందుకు వచ్చానని పవన్ అన్నారు. తనకు సినిమా అన్నం పెట్టిందని, చిత్రం అంటే ప్రాణవాయువుతో సమానంమని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కు ఛైర్మన్‌ గా రత్నం పేరును ప్రతిపాదించినట్లు తెలిపారు. పవన్ లీడ్ రోల్ లో రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం.. జులై 24న రిలీజ్ కానుంది.

ఒకప్పుడు #AMRathanam గారి వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు తిరిగేవారు.

అలాంటి ఆయన నలిగిపోతుంటే నాకు చాలా బాధేసింది.

- #PawanKalyan at #HHVMPressMeet#HariHaraVeeraMallu #HHVM #HHVMonJuly24 #Tupaki pic.twitter.com/GQRpyToY4k

— Tupaki (@tupaki_official) July 21, 2025

మీడియా మిత్రులతో నేను పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ, సినిమా పరంగా ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు.

నాకు పని చేయడం తెలుసు తప్ప, సినిమా ను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు.

మీడియాతో మాట్లాడకపోవడానికి నాకు పొగరు, అహంకారం కాదు. సినిమా గురించి చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది.

-… pic.twitter.com/EtbpXcu5LO

— Tupaki (@tupaki_official) July 21, 2025


Tags:    
  • PawanKalyan 
  • HariHaraVeeraMallu 
  • AMRathnam 
  • Tollywood 
  • PowerStar 
  • VeeraMalluPressMeet 
  • PawanFirstPressMeet 
  • Keeravani 
  • IndianCinema 
  • FilmIndustry 
  • PublicityTalk 
  • PanIndiaCinema 
  • PKFans 
  • TollywoodNews 
  • MegaFansCelebration 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS