వీరమల్లు రిలీజ్ ముందు చిన్నారి ఆహా బర్త్ డే!
ఈ సందర్భంగా దర్శకుడు జ్యోతి కృష్ణ ఓ బ్యూటిఫుల్ మూమెంట్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదొక ప్రోఫెషనల్ మెమోరీ కాదు. లైఫ్ టైం మెమోరీ అంటూ ఓపిక్ ని షేర్ చేసారు.;
`హరిహరవీరమల్లు` చిత్ర దర్శకుడిగా ఏ. ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ బాధ్యతలు తీసుకోవడం అన్నది అనోకుకుండా చోటు చేసుకున్న సన్నివేశం. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేస్తానని జ్యోతికృష్ణ కూడా ఏ నాడు అనుకుని ఉండడు. కానీ కాలం కొన్ని అవకాశాలను అనుకోకుండానే కల్పిస్తుంది. అలా జ్యోతి కృష్ణ కు ఈ అవకాశం లభించింది. మరో సినిమా అవకాశం రావడంతో వీరమల్లు నుంచి క్రిష్ మధ్యలో తప్పు కోవడంతో జ్యోతికృష్ణ బాధ్యతీసుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో ఎవరెంత భాగం డైరెక్ట్ చేసారు? ఎవరి క్రెడి బిలిటీ ఎంత అన్నది పక్కనబెడితే అంతిమంగా జ్యోతి కృష్ణ ఎక్కువగా హైలైట్ అవుతున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్ని సినిమా అన్ని పను లు పూర్తి చేసుకుని ఈనెల 24న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రత్నం ఐదేళ్ల క్రితం మొదలు పెట్టి న ప్రాజెక్ట్ రిలీజ్ ఆలస్యమైనా ఎంతో సంతోషంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా విజయంతో నిర్మాతగా గ్రాండ్ కంబ్యాక్ లభిస్తుందని ఎంతో కాన్పిడెట్ గా ఉన్నారు.
ఇప్పటికే ప్రచారం పనులు కూడా మొదలయ్యాయి. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు జ్యోతి కృష్ణ ఓ బ్యూటిఫుల్ మూమెంట్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదొక ప్రోఫెషనల్ మెమోరీ కాదు. లైఫ్ టైం మెమోరీ అంటూ ఓపిక్ ని షేర్ చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో తన భార్యా పిల్లలు ..తండ్రి రత్నంతో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జ్యోతికృష్ణ కుమార్తె ఆహాను ఎత్తుకుని ముద్దాడారు. నేడు ఆహా పుట్టిన రోజు సందర్భంగా ఈ సన్నివేశంచోటు చేసుకుంది. ఆహాను దీవించి పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేసారు. వీరమల్లు రిలీజ్ అవుతున్న తరుణంలో కుమార్తె పుట్టిన రోజు కూడా కలిసి రావడంతో సినిమా సక్సెస్ కు ఈ బర్త్ డే ఓ శుభసూచికంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోరుకుం టున్నారు. ఈ పిక్ లో పవన్ స్వామిజీ అవతారంలో కనిపిస్తున్నారు. కాషాయం ధరించి మాలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాలలు ధరిస్తోన్న సంగతి తెలిసిందే.