• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షూట్ మళ్లీ షురూ.....

షూట్ మళ్లీ షురూ.. వీరమల్లు రాక ఎప్పుడంటే!

| పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రారంభం అయిన 'హరి హర వీరమల్లు' సినిమా ఇంకా పూర్తి అవ్వలేదు.

By - Tupaki Desk
Update: 2024-09-17 05:38 GMT

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రారంభం అయిన 'హరి హర వీరమల్లు' సినిమా ఇంకా పూర్తి అవ్వలేదు. ఇటీవలే రెండు పార్ట్‌ లుగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్‌ క్రిష్ చేతి నుంచి జ్యోతి కృష్ణ చేతికి చేరింది. క్రిష్ ఇతర ప్రాజెక్ట్‌ ల కారణంగా హరి హర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయినప్పటి నుంచి హరి హర వీరమల్లు షూటింగ్‌ పునః ప్రారంభం కాబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ పవన్‌ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ కు హాజరు అయ్యేందుకు డేట్లు ఇచ్చాడని తెలుస్తోంది. ఈ వారంలోనే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ ను దర్శకుడు జ్యోతి కృష్ణ పునః ప్రారంభించబోతున్నాడు. మొదటి వారం రోజులు పవన్‌ లేకుండానే షూటింగ్ కార్యక్రమాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్‌ తో పాటు నటి శ్రియా రెడ్డి, ఇమ్రాన్‌ హష్మీ లు తాజా షెడ్యూల్‌ లో పాల్గొనబోతున్నారు.

ఈ నెలలోనే పవన్‌ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ 23 నుంచి వీరమల్లు సెట్‌ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ జాయిన్ అవ్వబోతున్నాడు. పవన్‌ కళ్యాణ్ రెండు వారాల పాటు షూటింగ్‌ లో పాల్గొంటాడని తెలుస్తోంది. పవన్‌ కి అనుకూలంగా ఉండే విధంగా షూటింగ్ ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏపీలోనే కొన్ని సన్నివేశాలను పవన్‌ మీద షూట్‌ చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారని, కొన్ని సన్నివేశాల కోసం పవన్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌ కి వెళ్లబోతున్నాడట.

మొత్తానికి హరి హర వీరమల్లు పార్ట్‌ 1 షూటింగ్‌ ను అక్టోబర్‌ మొదటి వారంలో ముగించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తారని తెలుస్తోంది. పార్ట్‌ 2 కి ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే బ్యాలన్స్ షూటింగ్‌ ను ముగించి వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. రెండు సినిమాలు కలిపి వెయ్యి కోట్ల వసూళ్లను హరి హర వీరమల్లు సాధిస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు, పవన్‌ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ షూటింగ్‌ కు హాజరు అయితే జనాల నుంచి స్పందన ఎలా ఉంటుంది అనేది పెద్ద సందేహం. జనాల రియాక్షన్ ను బట్టి పవన్ తదుపరి సినిమాల షూటింగ్స్ ఉంటాయని ఆయన సన్నిహితులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు.

Tags:    
  • Hariharaveeramallu 
  • Tollywood 
  • Filmindustry 
  • Shooting 
  • Krish 
  • Amratnam 
  • Keeravani 
  • Pawankalyan 
  • Janasena 
  • Deputychiefminister 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS