• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ వీడియో వైరల్.....

పవన్ వీడియో వైరల్.. రోడ్డుపైనే అలా..

| ఇక రాజకీయాలకు సంబంధించి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే పవన్ కొద్ది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-11-23 07:01 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక రాజకీయాలకు సంబంధించి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే పవన్ కొద్ది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయనకు ఇన్స్టాగ్రామ్ లో 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ట్విట్టర్ లో ఎప్పుడూ రాజకీయాల గురించి పోస్టులు పెట్టే పవన్ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఎప్పుడో ఓసారి ఆసక్తికర పోస్ట్ పెడుతున్నారు. ఓ రెండు వారాల కింద నరేంద్ర మోడీ సభ గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన పవన్ తాజాగా ఓ కుక్క గురించి పోస్ట్ చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఓ పోలీస్ కుక్కతో పవన్ సరదాగా ఉన్న వీడియోను షేర్ చేస్తూ..

" నేను బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నా ఫ్లైట్ ఎక్కేందుకు ఎదురుచూస్తుండగా నా కోసం ఓ సర్ ప్రైజ్ విజిటర్ వచ్చాడు. అతను ఎవరో కాదు పోలీస్ డాగ్ స్క్వాడ్ లో ఉండే బిందు. అది నాతో చాలా స్నేహంగా ఉంది. తన తోకని ఆసక్తి గా ఊపింది. తను నాలో ఉత్సాహం నింపింది. నేను విమానం ఎక్కేముందు అనుకోని అందమైన అనుభూతి ఇచ్చింది" అంటూ రాసుకోచ్చాడు పవన్. దీంతో పవన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ పోలీస్ డాగ్ తో పవన్ క్యూట్ వీడియో అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక పవన్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే ఓ షెడ్యూల్ మొదలవగా పవన్ పొలిటికల్ ఈవెంట్స్ వల్ల ఆ షెడ్యూల్ కాస్త వాయిదా పడింది.హరిష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ షూటింగ్ పలుమార్లు వాయిదా పడడం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పవన్ ఎక్కువగా రాజకీయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న. పవన్ సినిమాలన్నీ హోల్డ్ లో ఉన్నాయి. ఎలక్షన్స్ తర్వాతే పవన్ మళ్లీ తన సినిమా షూటింగ్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

Tags:    
  • Pavankalyan 
  • Janasenaparty 
  • Narendramodi 
  • Begumpetairport 
  • Policedog 
  • Bindu 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS