• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్ కు మరో స్టార్ బ్యూటీ...

నయన్ కు మరో స్టార్ బ్యూటీ సపోర్ట్

| అందుకే సినిమా షూటింగ్ కి సంబందించిన వీడియోలు పర్మిషన్ లేకుండా వాడుకున్నారని ధనుష్ నోటీసులు పంపించారు.

By - Tupaki Desk
Update: 2024-11-25 04:25 GMT

కోలీవుడ్ ఇండస్ట్రీలో నయనతార, ధనుష్ ఇష్యూ ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అందరికి తెలిసిందే. రీసెంట్ గా నయనతార బయోగ్రఫీతో డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. అందులో ఆమె విజయ్ సేతుపతికి జోడీగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన ‘నేను రౌడీనే’ మూవీ టైంలో షూటింగ్ క్లిప్ ని ఉపయోగించింది. 3 సెకండ్స్ నిడివి ఉన్న ఆ క్లిప్ వాడినందుకు హీరో ధనుష్ ఆమెకి లీగల్ నోటీసులు పంపించారు.


10 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఆ మూవీని ధనుష్ నిర్మించాడు. అందుకే సినిమా షూటింగ్ కి సంబందించిన వీడియోలు పర్మిషన్ లేకుండా వాడుకున్నారని ధనుష్ నోటీసులు పంపించారు. దీనిపై నయనతార ఓపెన్ లెటర్ రాసి ధనుష్ పైన తీవ్ర విమర్శలు చేసింది. నిజానికి ఆ వీడియో క్లిప్ కోసం తాను సంప్రదించానని, అయితే మీ వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని లేఖలో పేర్కొంది. కష్టపడి ఎదిగిన నాలాంటి వారిని 10 కోట్ల నష్టపరిహారం అడగడం ఎంత వరకు న్యాయం అంటూ నయనతార ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో కొంతమంది నయనతారకి మద్దతుగా నిలిచారు. అలాగే ధనుష్ ఫ్యాన్స్ మాత్రం నయనతారని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ ఇష్యూపై మలయాళీ స్టార్ యాక్టర్ పార్వతి తిరువోతు రియాక్ట్ అయ్యారు. నాగ చైతన్య ‘దూత’ వెబ్ సిరీస్ లో ఆమె కీలక పాత్రలో నటించింది. పార్వతి ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ నయనతార రాసిన లెటర్ నేను చదివాను.

ఆమె అడిగిన దాంట్లో నిజం ఉందనిపించింది. అందుకే ఆమెకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాను. నయనతార ఎలాంటి సపోర్ట్ లేకుండా తన కష్టంతో ఈ స్థాయికి ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొంది. ఆమె అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది. అందుకే ఆమెకి మద్దతుగా నిలబడటం ముఖ్యం అనుకున్నాను. ఇలాంటి సమస్యని ఇండస్ట్రీలో మనలాంటి చాలా మంది ఎదుర్కొంటున్నారు. గట్టిగా మాట్లాడినపుడు, అందులో నిజం ఉంటే మద్దతుగా నిలబడం చాలా ముఖ్యం.

ఒంటరిగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాగే ఒకరి మద్దతు దొరికితే కచ్చితంగా కొండంత ధైర్యం వస్తుంది. అందుకే నేను నయనతారకి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాను అని పార్వతి తిరువోతు తెలియజేసింది. గతంలో మలయాళీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపైన బలంగా గొంతు వినిపించింది. ఆ సమయంలో ఆమెకి మద్దతుగా ఎవరు నిలబడలేదు. ఈ నేపథ్యంలో పార్వతి తిరువోతు నయనతార గురించి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Nayantharabiopic 
  • Documentary 
  • Netflix 
  • Nayanthara 
  • Dhanush 
  • Comments 
  • Parvathythiruvothu 
  • Malayalamindustry 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS