విమ‌ర్శ‌ల‌పై న‌టుడు పార్తీబ‌న్ షాకింగ్ నిర్ణ‌యం!

ప‌బ్లిక్ ప్లాట్ ఫామ్‌పై పార్తీబ‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై నెటిజ‌న్‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ పార్తీబ‌న్‌పై ఫైర్ అవుతున్నారు.;

Update: 2026-03-28 11:30 GMT

మూవీ ఈవెంట్‌ల‌లో స్టేజ్‌పై న‌టీన‌టులు చేసే స్టేట్మెంట్‌లు వాళ్ల వ్యక్త‌గత జీవితాన్ని స‌మ‌స్య‌ల సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయి. తొంద‌ర పాటుతో చేసే స్టేట్మెంట్‌లు ఇబ్బందుకు గురి చేస్తూ నెట్టింట ట్రోల్‌కు గుర‌య్యేలా ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. కోలీవుడ్ న‌టుడు పార్తీబ‌న్ ప‌రిస్థితి ఇప్పుడు అలాగే మారింది. నో క్యాస్ట్ - నో రిలీజియ‌న్ స‌ర్టిఫికెట్ కోసం ఆయ‌న ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పార్తీబ‌న్ పాల్గొని త‌న సామాజిక వ‌ర్గం గురించి ఓపెన్‌గా చెప్ప‌డంపై వివాదం మొద‌లైన విష‌యం తెలిసిందే.

ప‌బ్లిక్ ప్లాట్ ఫామ్‌పై పార్తీబ‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై నెటిజ‌న్‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ పార్తీబ‌న్‌పై ఫైర్ అవుతున్నారు. దీనిపై ఆయ‌న మ‌రోసారి స్పందిస్తూ ఓ వీడియోని విడుద‌ల చేసి వివ‌ర‌ణ ఇచ్చారు. తాను కులాన్ని, మ‌తాన్ని ప‌ట్టించుకోనన్నారు. త‌న మాతృభాష తెలుగు అని చెప్ప‌డానికి బ‌దులుగా సామాజికవ‌ర్గం పేరును పొర‌పాటుని చెప్పాన‌న్నారు. దీనిని ప‌లువురు విమ‌ర్శించ‌డం త‌న‌ను తీవ్రంగా బాధించింద‌న్నారు. అప్పుడే నో క్యాస్ట్ - నో రిలీజియ‌న్ స‌ర్టిఫికెట్ తీసుకోవ‌చ్చ‌నే విష‌యం తెలిసి దాని కోసం ద‌ర‌ఖాస్తు చేశాన‌న్నారు.

స‌ర్టిఫికెట్ వ‌స్తే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆ స‌ర్టిఫికెట్ తీసుకున్న తొలి వ్య‌క్తిని తానే అవుతాన‌న్నారు. ఈ స‌ర్టిఫికెట్ పొందండం గురించి ప్ర‌జ‌ల్లోనూ ఆవ‌గాహ‌న క‌ల్పించి దీనిని ఒక ఉద్య‌మంలా ముందుకు తీసుకెళ్తాన‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థాయకుడిగా న‌టించిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` మూవీతో పార్తీబ‌న్ విల‌న్‌గా న‌టించాడు. ప‌వ‌న్ సినిమాలో పార్తీబ‌న్ విల‌న్‌గా న‌టించడం ఇదే ఫ‌స్ట్ టైమ్ కావ‌డంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ దృష్టిలో ప‌డటానికి చాలా ప్ర‌య‌త్నించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అని త్వ‌ర‌లోనే సీఎం అవుతార‌ని వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై అక్క‌డే ఉన్న ప‌వ‌న్ పెద్ద‌గా రియాక్ట్ కాలేదు. కొంత వ‌ర‌కు సీరియ‌స్‌గానే క‌నిపించారు. సినిమా వేడుక‌లో రాజ‌కీయాల ప్ర‌స్థావ‌న స‌రికాద‌న్న‌ట్టుగా ప‌వ‌న్ సీరియ‌స్ మోడ్‌లో క‌నిపించ‌డంతో దానికి సంబంధించిన విజువ‌ల్స్ అప్ప‌ట్లో నెట్టింట ట్రెండ్ అయ్యాయి. పార్తీబ‌న్ ఓవ‌ర్‌గా రియాక్ట్ అవుతున్నార‌ని నెటిజ‌న్‌లు చుర‌కలు అంటించారు కూడా. అదీ చాల‌ద‌న్న‌ట్టుగా త‌న సామాజిక వ‌ర్గం, ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం ఒక‌టేన‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసి అక్క‌డే అడ్డంగా నెటిజ‌న్‌ల‌కు దొరికిపోయారు.

గ‌త కొంత కాలంగా పేరున్న న‌టులు సినిమా ఈవెంట్‌ల‌లో మాట్లాడుతూ అన‌వ‌ర వివాదాల‌కు కార‌ణం అవుతున్నారు. కొంత మంది మ‌హిళా క‌మీష‌న్ వ‌ర‌కు వెళ్లి చివాట్లు తింటే మ‌రి కొంత మంది చేసిన త‌ప్పుకు నాలుక క‌రుచుకుని బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెబుతూ త‌మ స్థాయిని త‌గ్గించుకుంటుండ‌టం క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హరించాల్సిన వారే ఇలా అన‌వ‌స‌ర స్టేట్మెంట్‌లిస్తూ వివాదాల‌ని కొని తెచ్చుకుంటుండ‌టం ప‌లువురిని షాక్‌కు గురి చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇక‌నైనా ఈ ధోర‌ణికి ఫుల్ స్టాప్ ప‌డుతుందా? అంటే ఒక‌రిని మించి ఒక‌రు అన్న‌ట్టుగా సీనియ‌ర్ ఆర్టిస్ట్‌లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఇది ఆగేలా క‌నిపించ‌డం లూఏద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News