చెక్ పెట్టేందుకు సెన్సార్ బోర్డు రెడీ అయిందా?

సినిమా రిలీజ్ కు ముందు సెన్సార్ ప్రాసెస్ తప్పనిసరి. అయితే ఇటీవల కాలంలో సెన్సార్ సర్టిఫికేషన్, కట్‌ లపై అభ్యంతరాలు, మారుతున్న రూల్స్ పై నిర్మాతలు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Update: 2026-07-02 19:30 GMT

సినిమా రిలీజ్ కు ముందు సెన్సార్ ప్రాసెస్ తప్పనిసరి. అయితే ఇటీవల కాలంలో సెన్సార్ సర్టిఫికేషన్, కట్‌ లపై అభ్యంతరాలు, మారుతున్న రూల్స్ పై నిర్మాతలు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న వివాదాలు, పరిశ్రమలో నెలకొన్న కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో నిర్మాతలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం. సెన్సార్ బోర్డు ఆఫీస్ లో ప్రొడ్యూసర్లతో స్పెషల్ ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు!

ఆ సమావేశానికి పలువురు నిర్మాతలను ఆహ్వానించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారని వినికిడి. ఇటీవల సెన్సార్ ప్రక్రియ చుట్టూ ఏర్పడుతున్న సమస్యలు, సర్టిఫికేషన్‌ లో ఎదురవుతున్న ఇబ్బందులు, మారుతున్న నిబంధనలపై క్లారిటీ ఇవ్వడమే ఆ మీటింగ్ మెయిన్ రీజన్ గా తెలుస్తోంది. గత కొంతకాలంగా పలు సినిమాలు సెన్సార్ దశలోనే హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని చిత్రాలకు కట్స్ సూచించడం, మరికొన్నింటికి సర్టిఫికెట్ ఇవ్వడంలో ఆలస్యం జరగడం, కొన్ని సందర్భాల్లో నిర్మాతలు, సెన్సార్ బోర్డు మధ్య భిన్నాభిప్రాయాలు బయటపడటం తరచూ కనిపించింది.

మరోవైపు సోషల్ మీడియా ఎఫెక్ట్ పెరిగిన రోజుల్లో సినిమాల్లోని ప్రతి సీన్, ప్రతి డైలాగ్‌ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. మరికొందరు మాత్రం క్రియేటివిటీ ఫ్రీడమ్ ను సపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు నిర్ణయాలు కూడా ఎక్కువగా చర్చకు వచ్చాయి. దీంతో సినీ ఇండస్ట్రీలో క్లియర్ రూల్స్ కచ్చితంగా అవసరమనే అభిప్రాయం బలపడింది.

అయితే మీటింగ్ లో నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను సెన్సార్ బోర్డు నేరుగా విన్నట్లు సమాచారం. సర్టిఫికేషన్ ప్రక్రియను మరింత క్రెడిబిలిటీతో ఎలా చేయాలి? మారుతున్న రూల్స్ పై ముందుగానే ఎలా అవగాహన కల్పించాలి? వివాదాలకు అవకాశం లేకుండా ఎలాంటి విధానాలు అనుసరించాలి? వంటి అంశాలపై చర్చించారు. సినిమా పూర్తయిన తర్వాత అనుకోని మార్పులు సూచిస్తే నిర్మాతలకు అదనపు ఖర్చు, టైమ్ వేస్ట్ అవుతుందనే అభిప్రాయం పరిశ్రమలో ఉంది.

అదే సమయంలో సామాజిక బాధ్యత, చట్టపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని సెన్సార్ బోర్డు కూడా తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండాలన్నదే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన అంశంగా చెబుతున్నారు. అయితే మీటింగ్ తర్వాత సెన్సార్ ప్రక్రియలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిర్మాతలు పాటించాల్సిన అంశాలపై క్లారిటీ రావడంతో పాటు సర్టిఫికేషన్ ప్రక్రియ ఈజీగా మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్ అభిప్రాయాల మార్పిడికే పరిమితం కాకుండా, ఫ్యూచర్ లో సెన్సార్‌ కు సంబంధించిన వివాదాలు తగ్గించే దిశగా ఒక మంచి ప్రయత్నంగా మారింది. క్రియేటివిటీకి ఫ్రీడమ్ కు ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో రూల్స్ సరైన విధంగా అమలయ్యేలా కొత్త అవగాహన ఏర్పడుతుందా? సెన్సార్ ప్రక్రియ మరింత క్రెడిబిలిటీగా మారుతుందా? అనే విషయాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

Tags:    

Similar News