టాక్సిక్ ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు క‌ష్టమేనా?

హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ మేకింగ్ స్టైల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో టెక్నికల్ గా సరికొత్త రికార్డులను సృష్టించేలా కనిపిస్తోంది.

Update: 2026-07-02 16:04 GMT

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో `టాక్సిక్` ఒకటి. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ మేకింగ్ స్టైల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో టెక్నికల్ గా సరికొత్త రికార్డులను సృష్టించేలా కనిపిస్తోంది. అయితే ఈ భారీ యాక్షన్ హంగామా ఓ ముఖ్యమైన చర్చకు తెర తీసింది. కంటెంట్ పరంగా సినిమా ఎంత బోల్డ్‌గా ఉండబోతోంది? ఆ తీవ్రత ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేలా ఉంటుందా? లేక? వారిని దూరం చేస్తుందా ? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు కుటుంబంతో కలిసి సినిమా చూడటం అల‌వాటు. టాక్సిక్ అనే టైటిల్ - అందులో ఉండబోయే యాక్షన్ సన్నివేశాల తీవ్రత చూస్తుంటే? ఇది యూత్ అండ్ యాక్షన్ లవర్స్ కోసం మాత్రమే రూపొందించిన చిత్రమా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంటెంట్ బోల్డ్‌గా ఉంటే సెన్సార్ పరమైన చిక్కులతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి వెనకాడతారు. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవాలంటే కుటుంబ ప్రేక్షకుల ఆదరణ తప్పనిసరి. ఆ ర‌కంగా చూస్తే `టాక్సిక్` మార్కెట్‌ను ఎంత వరకు విస్తరిస్తుందో? చూడాలి.

సినిమా మేకింగ్‌లో హాలీవుడ్ ప్రమాణాలను పాటించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ అది కథాంశాన్ని మించిపోకూడదు. యాక్షన్ సినిమాలంటే రక్తపాతం, హింస మాత్రమే కాదు. వాటి వెనుక బలమైన ఎమోషన్ కూడా ఉండాలి. విజువల్స్ మీదనే దృష్టి పెడితే కథలోని లోతు దెబ్బతింటుంది. కుటుంబ ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు ఎమోషనల్ కనెక్ట్‌ను కోరుకుంటారు. కానీ టాక్సిక్ లో బోల్డ్ కంటెంట్ ఉన్న‌ది ఇప్ప‌టికే రివీల్ అ యింది. కారులో శృంగార స‌న్నివేశంతో? ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ను స‌మాత‌రంగా డిజైన్ చేసి వ‌దిలారు.

ఆ స‌న్నివేశాన్ని టీజ‌ర్లోనే రివీల్ చేసారు. ఇలాంటి స‌న్నివేశాలున్న సినిమాను కుటుంబంతో కూర్చుని చూడ‌టం అన్న‌ది ఇబ్బందిక‌ర‌మైందే. అయితే దర్శకులు నేటి తరం ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కంటెంట్‌ను మారు స్తున్న మాట కూడా నిజమే. ఇప్పుడొస్తున్న‌ యాక్షన్ చిత్రాలు కూడా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తున్నాయన్న‌ది అంతే నిజం. ఈ నేప‌థ్యంలో బోల్డ్ కంటెంట్ ఉన్నంత మాత్రాన అది ఫ్యామిలీకి పూర్తిగా దూరమని చెప్పలేం. ప్రజెంట్ చేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. మేకర్స్ గనుక కథలో తగినంత ఎమోషన్ - వాల్యూస్‌ను జోడిస్తే బోల్డ్ అటెంప్ట్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలుచుకునే అవకాశం లేక‌పోలేదు.

నిజానికి టాక్సిక్ వంటి చిత్రాలు కమర్షియల్ హద్దులను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాయి. గ్లామర్, యాక్షన్, ఎమో షన్ అనే ఫార్ములాను దాటి కొత్త తరహా సినిమాను అందించడం అనేది గొప్ప సాహసం. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే టాలీవుడ్‌లో కొత్త ఒరవడికి నాంది పలికిన‌ట్లే. యాక్షన్ సినిమాల విషయంలో బెంచ్ మార్క్‌గా నిలుస్తుంది. రిస్క్ ఉన్నా? కంటెంట్ పట్ల మేకర్స్ చూపిస్తున్న ధైర్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News