• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అత‌డికి 5 నిమిషాల్లో...

అత‌డికి 5 నిమిషాల్లో ప‌డిపోయిన అందాల న‌టి

| పరిణీతి తన యూట్యూబ్ ఛానెల్‌లో రాజ్ షమనితో తన ఇంటర్వ్యూలో రాఘవ్‌తో ప్రేమ కథ గురించి మాట్లాడింది.

By - Tupaki Desk
Update: 2024-05-01 01:30 GMT

మ్యూజిక‌ల్ బ‌యోపిక్ `అమర్ సింగ్ చమ్కిలా`లో పరిణీతి చోప్రా నటనకు సానుకూల స్పందనలు ద‌క్కాయి. రాఘ‌వ్ తో పెళ్లి తర్వాత ఈ సినిమా విజ‌యం పారీకి మ‌ర‌పు రానిదిగా మారింది. రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాను 2023లో ప‌రిణీతి పెళ్లాడింది. ఆ త‌ర్వాత ఈ జంట అన్యోన్య‌త‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. పరిణీతి తన యూట్యూబ్ ఛానెల్‌లో రాజ్ షమనితో తన ఇంటర్వ్యూలో రాఘవ్‌తో ప్రేమ కథ గురించి మాట్లాడింది. ఈ చాటింగ్ సెష‌న్‌లో అత‌డితో ఐదు నిమిషాలు మాట్లాడాక పెళ్లాడేయాల‌నుకున్నా.. పెళ్ల‌యి భార్య పిల్ల‌లు ఉన్నా తెలీదు.. కానీ అత‌డినే పెళ్లాడేయాల‌నుకున్నాను అని వ్యాఖ్యానించింది.

పరిణీతి మాట్లాడుతూ ``రాఘ‌వ్, నేను లండన్‌లో ఒక కార్యక్రమంలో కలుసుకున్నాం. సాధారణంగా నేను హాయ్ చెప్పి ముందుకు సాగిపోతాను.. కానీ ఈసారి `అల్పాహారం కోసం కలుద్దాం` అని చెప్పాను. మా టీమ్‌లు సహా మేం 8-10 మంది ఉన్నాం. మేం మరుసటి రోజు అల్పాహారం స‌మ‌యంలో కలుసుకున్నాము. అతడు ఎవరో అతడు ఏం మాయ చేసాడో నాకు తెలియదు. అల్పాహారం తర్వాత నేను అతడిని ప‌రీక్ష‌గా చూసాను. అతడు చేసే అన్ని పనుల గురించి తెలుసుకున్నాను. ఆ త‌ర్వాత మేం పెళ్లి చేసుకుంటామని వారాల్లో రోజుల్లో కాదు.. నిమిషాల్లో నిర్ణ‌యించుకున్నాం`` అని తెలిపారు.

``నేను ప్రమాణం చేస్తున్నాను.. నేను రాఘవ్‌ని కలిశాను.. ఐదు నిమిషాల్లో నేను ఈ వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నానని నాకు తెలుసు. అతడికి పెళ్లయిందా, పిల్లలు ఉన్నారా? ఎంత వయస్కుడో కూడా నాకు తెలియదు. అతడు నా ముందు బ్రేక్‌ఫాస్ట్‌లో కూర్చున్నాడు.. నేను ఈ వ్యక్తిని చూస్తూ ఈ పెళ్లి చేసుకోబోతున్నానని అనుకుంటున్నాను. ఇది నాలోని ఏదో దేవుని స్వరం`` అని ప‌రిణీతి తెలిపారు.

గతేడాది సెప్టెంబర్ 24న పరిణీతి- రాఘవ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌- ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వివాహానికి పరిణీతి అత్త, ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆదిత్య ఠాక్రే, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మనీష్ మల్హోత్రా, హర్భజన్ సింగ్, సానియా మీర్జా కూడా వివాహానికి హాజరయ్యారు. రాఘవ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు.

పరిణీతి ఇటీవల ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌న `అమర్ సింగ్ చమ్కిలా`లో దిల్జిత్ దోసాంజ్ సరసన నటించింది. దిల్జిత్ టైటిల్ రోల్ పోషించగా, పరిణీతి ఈ మ్యూజికల్ బయోపిక్‌లో అతడి భార్య అమర్‌జోత్ కౌర్ పాత్రను పోషించారు. అమర్ సింగ్ చమ్కిలా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags:    
  • AmarSinghChamkila 
  • ParineetiChopra 
  • RaghavChadha 
  • Politician 
  • RajShamani 
  • Interview 
  • YouTubechannel 
  • London 
  • Udaipur 
  • Rajasthan 
  • PriyankaChopra 
  • MadhuChopra 
  • ArvindKejriwal 
  • DelhiCM 
  • AadityaThackeray 
  • DiljitDosanjh 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS