అజిత్ దోవ‌ల్ పాత్ర‌పై సంచ‌ల‌న న‌టుడి పోలిక‌!

`స్పై` చిత్రాల్లో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ దోవ‌ల్ పాత్ర‌కుండే ప్రాధాన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2026-03-29 01:30 GMT

`స్పై` చిత్రాల్లో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ దోవ‌ల్ పాత్ర‌కుండే ప్రాధాన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ భ‌ద్ర‌త కోసం ఆయ‌న ఎలాంటి త్యాగాల‌కు సిద్ద ప‌డ్డారు? అన్న‌ది సినిమాల రూపంలో ప్ర‌జ‌లంద‌రికీ ఇప్పుడిప్పుడే అర్ద‌మ‌వుతుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన ధురంధ‌ర్ 2 తో మ‌రోసారి క్లారిటీ వ‌చ్చింది. తాజాగా

బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ అజిత్ దోవ‌ల్ పాత్రల విషయంలో జరుగుతున్న పోలికలపై ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్` చిత్రంలో ప‌రేష్ రావ‌ల్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్రకు, తాజాగా `ధురందర్ 2` చిత్రంలో ఆర్. మాధవన్ పోషించిన అదే తరహా పాత్రకు మధ్య నెటిజన్లు పోలికలు తీసుకువస్తున్నారు. తాజాగా దీనిపై పరేష్ రావల్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

పరేష్ రావల్ మాట్లాడుతూ `ఒకే వ్యక్తి జీవితం లేదా ఒకే హోదా ఆధారంగా ఇద్దరు నటులు నటించినప్పుడు పోలికలు రావడం సహజమన్నారు. అయితే ప్రతి నటుడికి ఒక సొంత‌ శైలి ఉంటుందన్నారు. మాధవన్ అద్భుతమైన నటుడని ఆయన కొనియాడారు. `నేను నా పద్ధతిలో ఆ పాత్రకు ప్రాణం పోశాను. మాధవన్ తనదైన శైలిలో ఆ పాత్రను పండించారు. ఇందులో ఒకరితో ఒకరిని పోల్చడం కంటే ఆ పాత్రలోని గాంభీర్యాన్ని చూడాలని అభిప్రాయపడ్డారు. అజిత్ దోవల్ వంటి శక్తివంతమైన వ్యక్తి పాత్రను పోషించడం ఏ నటుడికైనా సవాలేనని పరేష్ రావల్ అన్నారు.

`ఉరి` సినిమాలో ఆ పాత్ర దేశభక్తిని వ్యూహరచనను ప్రతిబింబిస్తే, `ధురందర్ 2`లో మాధవన్ పాత్ర ప్రస్తుత రాజకీయ పరిణామాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిందని విశ్లేషించారు. నటులుగా తాము కేవలం దర్శకుడి విజన్‌ను మాత్రమే అనుసరిస్తామన్నారు. ప్రతి సినిమా నేపథ్యం వేరుగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పరేష్ రావల్ మాధవన్ నటనను ప్రశంసించడమే కాకుండా సినిమాల మధ్య ఉండే ఆరోగ్యకరమైన పోటీని ఆహ్వానించారు. ఒకే ఇతివృత్తం లేదా ఒకే తరహా పాత్రలు వేర్వేరు సినిమాల్లో రావడం వల్ల ప్రేక్షకులకు వైవిధ్యం లభిస్తుందని అన్నారు.

మాధవన్ తన నటనతో ఆ పాత్రకు కొత్త కోణాన్ని జోడించారని, దాన్ని తాము గౌరవించాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చలకు ఫుల్ స్టాప్ పడ్డ‌ట్లే. ఇద్దరు దిగ్గజ నటులు ఒకే రకమైన పాత్రను పోషించినప్పుడు వారి నైపుణ్యాన్ని అభినందించాలే తప్ప తక్కువ చేయకూడదనే సందేశం ఆయన మాటల్లో కనిపిస్తోంది. అజిత్ దోవ‌ల్ పాత్ర‌లో లెజెండ‌రీ న‌టులిద్ద‌రు పాత్ర‌లో ఆత్మ‌ను ప‌ట్టుకునే న‌టించారు. ఇద్క‌ద‌రి స‌హ‌జ న‌ట‌న‌తోనే ఆ పాత్ర అంత గొప్ప‌గా పండింది. ఈరోల్ ఆ నటుల‌తోనే స‌రిపెట్టుకోదు. రాబోయే స్పై చిత్రాల్లో మ‌రింత మంది న‌టులు అజిత్ దోవ‌ల్ పాత్ర‌లో న‌టించే అవ‌కాశాలున్నాయి.

Tags:    

Similar News