ప‌రేష్ రావ‌ల్‌ని తీసుకొస్తా.. ట్రంప్ ప్ర‌తిజ్ఞ‌!

హావ‌భావాల‌తోనే హాస్యాన్ని పండించ‌గ‌లిగే అరుదైన నైపుణ్యం కొంద‌రికే ఉంటుంది. అలాంటి న‌టుల‌లో ప‌రేష్ రావ‌ల్ ఒక‌రు.;

Update: 2025-05-22 18:34 GMT

హావ‌భావాల‌తోనే హాస్యాన్ని పండించ‌గ‌లిగే అరుదైన నైపుణ్యం కొంద‌రికే ఉంటుంది. అలాంటి న‌టుల‌లో ప‌రేష్ రావ‌ల్ ఒక‌రు. భారతీయ సినిమా దిగ్గజ నటుల్లో అత‌డి పేరు ఎప్ప‌టికీ చిర‌స్థాయిగా ఉండిపోతుంది. ముఖ్యంగా హేరాఫేరి ఫ్రాంఛైజీలో బాబూరావు అలియాస్ బాబూ భ‌య్యా పాత్ర‌లో అత‌డి న‌ట‌న‌ను ప్రేక్ష‌కుల‌కు ఎప్పటికీ మ‌ర్చిపోరు. తెలుగు సినిమా శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌లో డాక్ట‌ర్ మావ‌య్య‌గాను అత‌డి న‌ట‌నను మ‌న వాళ్లు మ‌ర్చిపోలేరు.

హెరా ఫేరీలోని బాబూరావు గణపత్రావ్ ఆప్టే పాత్ర‌తో హృద‌యాల‌ను గెలుచుకున్న ప‌రేష్ ఇటీవల ఫ్రాంఛైజీలోని మూడో భాగంలో న‌టిస్తాడ‌ని అంతా భావించారు. కానీ ఈ సినిమాలో న‌టించ‌డం లేద‌ని ప్ర‌క‌టించి ప‌రేషాన్ చేసాడు. ఈ ప్ర‌క‌ట‌న‌తో నిరాశ‌ప‌డిన నిర్మాత కం న‌టుడు అక్ష‌య్ కుమార్ వెంట‌నే ప‌రేష్ పై కోర్టులో న‌ష్ట‌ప‌రిహారం కోర‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే ప‌రేష్ రావ‌ల్ ఏ కార‌ణంతో ఈ సినిమా నుంచి వైదొలిగారు? అన్న‌దానికి ఇంకా స్ప‌ష్ఠ‌త లేదు. ఇంత‌లోనే సోషల్ మీడియాల్లో ర‌క‌ర‌కాల‌ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ ఉత్కంఠ‌ను పెంచుతున్నాయి.. పరేష్ రావల్ లేకుండా, హేరా ఫేరీ 3 .... పావ్ లేకుండా పావ్ భాజీ లాగా ఉంటుందని - అసంపూర్ణమైన సినిమా అవుతుంద‌ని, విషాదకరంగా ఉంటుంద‌ని ర‌క‌ర‌క‌లుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ గ్రూపులోకి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వ‌చ్చి చేరాడు. డొనాల్డ్ ట్రంప్ పై ఒక‌ పేరడీ వీడియో వైరల్ అయింది. వీడియోలో నకిలీ ట్రంప్ నాటకీయ శైలి ఆక‌ర్షిస్తోంది. హేరా ఫేరి 3 కోసం పరేష్ రావల్‌ను తిరిగి తీసుకువస్తానని ట్రంప్ హామీ ఇచ్చిన‌ట్టు ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్ర‌స్తుతం దీనిని యూత్ వేగంగా వైర‌ల్ చేస్తున్నారు.

Tags:    

Similar News