పాల‌క్ అంద‌చందాలకు ప‌రేషాన్

స్టార్ కిడ్ అయినా పాలక్ తనకు తానుగా సినీ రంగంలో ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని చెప్పింది.;

Update: 2025-09-05 11:48 GMT

ప్ర‌ముఖ టీవీ న‌టి శ్వేతా తివారీ న‌ట‌వార‌సురాలు పాలక్ తివారీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సైఫ్ అలీఖాన్ న‌టవార‌సుడు ఇబ్ర‌హీం అలీఖాన్ గాళ్ ఫ్రెండ్ గా ఈ అమ్మ‌డి పేరు ఇటీవల ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచింది. పాల‌క్ బిజ్లీ బిజ్లీ అనే మ్యూజిక్ వీడియోతో వెలుగులోకి వచ్చింది. అటుపై సల్మాన్ ఖాన్‌తో కలిసి `కిసి కా భాయ్ కిసి కి జాన్` (2023) చిత్రంతో తెరంగేట్రం చేసింది. హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం `ది భూత్నీ` (2025), రోమియో S3లలో కూడా నటించింది.


స్టార్ కిడ్ అయినా పాలక్ తనకు తానుగా సినీ రంగంలో ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని చెప్పింది. సుహానా ఖాన్, అనన్య పాండే వంటి స‌హ‌న‌టీమ‌ణుల‌తో పోలుస్తూ నేపో కిడ్ అనే ట్యాగ్ ని మోయాల్సి వ‌స్తున్నా, తాను స్వ‌యంకృషితో ఎద‌గాల‌నే ప‌ట్టుద‌లను క‌న‌బ‌రుస్తోంది. కానీ ఇప్ప‌టికీ పాల‌క్ ఆరంభ క‌ష్టాల‌ను ఎదుర్కొంటోంది.


అయితే పాల‌క్ పేరు ఇటీవ‌ల ఇబ్ర‌హీంతో డేటింగ్ వ్య‌వహార‌మై ఎక్కువ‌గా ప్ర‌చారంలోకి రావ‌డంతో త‌న తండ్రి (త‌ల్లి నుంచి విడిపోయారు) రాజా చౌద‌రి కుమార్తెకు సూచిస్తూ.. డేటింగుల కంటే న‌ట‌న‌, హార్డ్ వ‌ర్క్‌పై దృష్టి సారించాల‌ని అన్నారు. మ‌రోవైపు పాల‌క్ ఇత‌ర న‌టీమ‌ణుల‌తో పోటీప‌డుతూ సోష‌ల్ మీడియా ల్లో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది.


తాజాగా పాల‌క్ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిగ్గా మారింది. పాల‌క్ అంద‌మైన నియాన్ గ్రీన్ ఫ్రాక్ లో ముచ్చ‌ట‌గా క‌నిపిస్తోంది. ఇది జీక్యూ ఇండియా కోసం ఫోటోషూట్ అంటూ పాల‌క్ వెల్ల‌డించింది. దీనిలో హాఫ్ షోల్డ‌ర్ డ్రెస్ లో పాల‌క్ అంద‌చందాల ఎలివేష‌న్ ప్ర‌ధానంగా హైలైట్ అయింది. అయితే ఇటీవ‌లి వ‌రుస ఫోటోషూట్ల‌ను ప‌రిశీలిస్తే, పాల‌క్ పూర్తిగా న‌ట‌నా కెరీర్ కంటే ఫోటోషూట్ల‌పైనే ఫోక‌స్ చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే అన్నిటికీ చెక్ పెట్టే ఒక గ్రేట్ ఛాన్స్ కోసం పాల‌క్ ఎదురు చూస్తోంది. ఈ భామ కెమెరా ఎదుట అడుగుపెట్టడానికి ముందే యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది. మునుముందు న‌టిగా పెద్ద స్థానం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. దానికి ప‌రిస్థితులు స‌హ‌క‌రించాల్సి ఉంది. త‌న జాత‌కాన్ని మార్చే ఆ ఒక్క ఛాన్స్ కోస‌మే ఈ వెయిటింగ్.


Tags:    

Similar News