ఆస్కార్ అవార్డులకు పా.రంజిత్ పాపా బుకా..!
98వ ఆస్కార్ అవార్డుల్లో ఎంట్రీ ఇచ్చింది పాపా బుకా.. పా రంజిత్ కో ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా పపువా న్యూ గినీ దేశం నుంచి తొలి మూవీగా ఛాన్స్ అందుకుంది.;
98వ ఆస్కార్ అవార్డుల్లో ఎంట్రీ ఇచ్చింది పాపా బుకా.. పా రంజిత్ కో ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా పపువా న్యూ గినీ దేశం నుంచి తొలి మూవీగా ఛాన్స్ అందుకుంది. ఆస్కార్ అవార్డుల్లో ఫీచర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ కేటగిరిలో పాపా బుకా సినిమా పోటీలో నిలిచింది. ఈ సినిమాను బిజు కుమార్ దామోదరన్ డైరెక్ట్ చేశాడు. 3 జాతీయ అవార్డులు అందుకున్న ఆయన పపువా న్యూ గినీకి చెందిన నోయెలెన్ తౌలాతో కలిసి పా రంజిత్, అక్షయ్ కుమార్ పరిజా, ప్రకాష్ బరే కలిసి నిర్మించారు.
నీలం ప్రొడక్షన్స్ లో గర్వించే క్షణాలు..
పి.ఎన్.జి కి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా ఈ సినిమా నిర్మించామని నోయెలెన్ నిర్మించారు. ఐతే ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ ఇవ్వడంపై పా రంజిత్ సోషల్ మీడియా లో తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. తమ బ్యానర్ నీలం ప్రొడక్షన్స్ లో గర్వించే క్షణాలు ఇవి.. పాపా బుకా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వారితో కలిసి పనిచేయడం గొప్పమా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పపువా న్యూ గ్నీ ఆస్కార్ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాన్ లైన్స్ కూడా పపువా న్యూ గినీకు ఇదొక హిస్టారిక్ మూమెంట్ అని.. అకాడమీ అవార్డుల వేదిక ద్వారా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
ఇంతకీ పాపా బుకా కథ ఏంటంటే.. రెండో వరల్డ్ వార్ లో పీ.ఎన్.జీతో పోరాడిన ఇండియ్హన్ సోల్జర్స్ గురించి చెప్పే కథ ఇది. పీ.ఎన్.జీ నిర్మాతలతో కలిసి ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో రీతాభరి చక్రవర్తి, ప్రకాష్ బరే నటించారు. సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ ఇవ్వడం సర్ ప్రైజ్ చేస్తుంది.
సినిమాలన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి..
ఓ పక్క తమిళ సినిమాలను డైరెక్ట్ చేస్తూ తన సత్తా చాటుతున్న పా రంజిత్ నీలం ప్రొడక్షన్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఇక పాపా బుకా ఆస్కార్ అవార్డుల్లో ప్రవేశించడం తో పా రంజిత్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్ కేవలం దర్శకుడిగానే కాదు ఒక ఫిల్మ్ మేకర్ గా నిర్మాత బాధ్యతలను కూడా అదరగొట్టే రీతిలో చేస్తున్నారు. ఐతే అకడమీ అవార్డ్ జ్యూరీని సైతం మెప్పించి ఆస్కార్ రేసులో పోటీల్లో నిలుస్తుంది పాపా బుకా.