వెబ్ సిరీస్ కొంప ముంచిన అస‌భ్య‌త‌!

ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌లో విశృంఖ‌ల‌త‌, ర‌క్త‌పాతం, అస‌భ్య‌త‌ పెచ్చు మీరుతున్న‌ సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-05-22 01:30 GMT
వెబ్ సిరీస్ కొంప ముంచిన అస‌భ్య‌త‌!

ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌లో విశృంఖ‌ల‌త‌, ర‌క్త‌పాతం, అస‌భ్య‌త‌ పెచ్చు మీరుతున్న‌ సంగ‌తి తెలిసిందే. సెన్సార్ నిబంధన‌లు, ప‌రిమితులు లేనందున ఈ ప‌రిస్థితి. ఇప్పుడు ఉల్లూ ఓటీటీలోని వెబ్ సిరీస్ లో ఓ స‌న్నివేశం హిందూ సెంటిమెంట్స్ ని హ‌ర్ట్ చేసింద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఓటీటీ సిరీస్ లోని ఓ సీన్ లో ఒక వృద్ధ జంట సెక్స్ టాయ్ గురించి ప్ర‌స్థావిస్తూ.. అది శివలింగానికి ప్ర‌తి రూపం అని పూజించడం ప్రారంభిస్తారు. అయితే ఇది చాలామంది హిందూ సెంటిమెంట్లు, న‌మ్మ‌కాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసేదిగా ఉంద‌ని భావిస్తున్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన జోక్‌ను పేల్చిన ఓటీటీని మూసేయాల‌ని పిలుపునిచ్చారు.

ఉల్లూ ని నిషేధించాల‌నే ప్ర‌య‌త్నం ఇదే మొదటిసారి కాదు. ఉల్లు ఓటీటీలో చాలా వివాదాస్ప‌ద అంశాల‌తో కంటెంట్ ని అందించింది. దీని కార‌ణంగా చాలా గొడ‌వ‌లు అయ్యాయి. అశ్లీలత‌ మోతాదుకు మించిన షోలలో హిందూ సెంటిమెంట్లను హ‌ర్ట్ చేయ‌డం తీవ్ర‌మైన నేరంగాను ప‌రిగ‌ణిస్తున్నారు. దేవుళ్ల‌ను కించ‌ప‌ర‌చ‌డం ట్రెండింగ్ గా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    

Similar News