• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ వారం ఓటీటీ/థియేటర్...

ఈ వారం ఓటీటీ/థియేటర్ కంటెంట్.. టాప్ లిస్ట్ ఇదే

| ప్రేక్షకులు కూడా ఈ దీపావళికి రిలీజ్ కాబోయే సినిమాలపై ప్రత్యేక ఆసక్తితో ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-29 06:18 GMT

దీపావళి ఫెస్టివల్ సందర్భంగా అన్ని భాషలలో విభిన్న కథలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అలాగే డిఫరెంట్ జోనర్ వెబ్ సిరీస్, మూవీస్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ దీపావళికి రిలీజ్ కాబోయే సినిమాలపై ప్రత్యేక ఆసక్తితో ఉన్నారు. థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమాల సంగతి చూసుకుంటే ఇలా ఉన్నాయి. తెలుగులో ‘లక్కీ భాస్కర్’ మూవీ అక్టోబర్ 31న పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో జంటగా నటించారు.

అలాగే కిరణ్ సబ్బవరం నటించిన థ్రిల్లర్ మూవీ ‘క’ కూడా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇది పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. కన్నడం నుంచి ప్రశాంత్ నీల్ కథ అందించిన చిత్రం ‘బఘీర’ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో శ్రీమురళీ, రుక్మిణి వసంత్ జోడీగా నటించారు. కోలీవుడ్ నుంచి శివ కార్తికేయన్ పాన్ ఇండియా మూవీ ‘అమరన్’ రిలీజ్ అవుతోంది.

రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి శివ కార్తికేయన్ కి జోడీగా నటించింది. దీని పైన చాలా హోప్స్ ఉన్నాయి. పై నాలుగు సినిమాలు అక్టోబర్ 31న గ్రాండియర్ గా ఆయా భాషలలో రిలీజ్ కాబోతున్నాయి. మూవీ ప్రమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా నడుస్తున్నాయి. ఇక హిందీలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా రోహిత్ శెట్టి ‘సింగం అగైన్’ నవంబర్ 1న రిలీజ్ అవుతోంది. అలాగే కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భూలయ్యా 3’ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఇక ఓటీటీలో రిలీజ్ కాబోయే మూవీస్, సిరీస్ ల సంగతి చూసుకుంటే జీ5లో ‘మిధ్య’ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ నవంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తోంది. ఈటీవీ విన్ లో ‘లవ్ మాక్ టైల్ సీజన్ 2’ సిరీస్ నవంబర్ 1న రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో ‘గోళం’ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్ మూవీస్

లక్కీ భాస్కర్ - అక్టోబర్ 31

“క” మూవీ - అక్టోబర్ 31

బఘీర - అక్టోబర్ 31

అమరన్ - అక్టోబర్ 31

సింగం అగైన్ (హిందీ) - నవంబర్ 1

భూల్ భూలయ్యా 3 (హిందీ) - నవంబర్ 1

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు :

జీ5

మిధ్య ( వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ ) - నవంబర్ 1

ఈటీవీ విన్

లవ్ మాక్ టైల్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) - నవంబర్ 1

నెట్ ఫ్లిక్స్

మర్డర్ మైండ్ ఫుల్లీ(హాలీవుడ్) - అక్టోబర్ 31

ది డిప్లొమ్యాట్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - అక్టోబర్ 31

అమెజాన్ ప్రైమ్ వీడియో

గోలం - స్ట్రీమింగ్ అవుతుంది

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • TheatresMovies 
  • Diwalifilms 
  • Luckybaskhar 
  • KA 
  • Amaran 
  • Bagheera 
  • SinghamAgain 
  • BhoolBhulaiyaa3 
  • Ottmovies 
  • Mithyawebseries 
  • Lovemocktail2 
  • Golam 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS