• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆస్కార్ వేదిక‌పైకి...

ఆస్కార్ వేదిక‌పైకి న‌గ్నంగా దూసుకొచ్చాడు

| అత‌డి రాక ఎక్స్ ప్రెష‌న్ ప్ర‌తిదీ వేదిక వ‌ద్ద ఉన్న‌వారిని క‌డుపుబ్బా న‌వ్వించాయి.

By - Tupaki Desk
Update: 2024-03-11 08:54 GMT

ఆస్కార్స్ 2024 వేదిక‌పై ఊహించ‌ని ఘ‌ట‌న‌. ఓవైపు సీరియ‌స్ గా ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తుంటే అత‌డు ఒంటిపై నూలు పోగైనా లేకుండా వేదిక‌పైకి దూసుకొచ్చేశాడు. అత‌డు త‌న కింది భాగానికి ఒక క‌వ‌రును మాత్ర‌మే అడ్డు పెట్టుకున్నాడు. ఆ దృశ్యం అహూతుల‌ను క‌న్ఫ్యూజ్ చేసినా కానీ, చివ‌రికి అది జాన్ సెనా అని తెలిశాక న‌వ్వులు కురిసాయి. వివ‌రాల్లోకి వెళితే.. రెజ్లర్ నుండి నటుడిగా మారిన ఆల్-రౌండ్ లెజెండ్ జాన్ సెనా 96వ అకాడమీ అవార్డ్స్‌లో ఒంటిపై బట్టలు లేకుండా న‌గ్నంగా క‌నిపించాడు. అత‌డి రాక ఎక్స్ ప్రెష‌న్ ప్ర‌తిదీ వేదిక వ‌ద్ద ఉన్న‌వారిని క‌డుపుబ్బా న‌వ్వించాయి.

మెర్మాన్ కెన్‌గా అతిధి పాత్రలో నటించిన జాన్ సెనా ఆస్కార్స్ పుర‌స్కారాల వేదిక‌పై హోస్ట్ తో క‌లిసి హాస్యం పండించాడు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును అందజేసేటప్పుడు త‌న ఒంటిపై దుస్తులు లేకుండా క‌నిపించ‌డం ద్వారా అతడు సినిమాల‌కు కాస్ట్యూమ్స్ ప్రాముఖ్యతను హైలైట్ చేశాడు. ఆస్కార్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్‌తో క‌లిసి జాన్ సెనా చేసిన ఈ స్కిట్ తక్షణమే వైరల్ అయ్యింది. అంతేకాదు.. ఈ వీడియో చాలా వేగంగా వెబ్ లో దూసుకెళ్లింది.

1974 ఆస్కార్స్‌లో జిమ్మీ కిమ్మెల్ ప్రెజెంటర్ డేవిడ్ నివెన్‌కు అంతరాయం కలిగించేలా వేదికపైకి పరిగెత్తిన స్ట్రీకర్ గురించి ప్రస్తావించడంతో ఈ కామెడీ స్కిట్ ప్రారంభమైంది. నాటి సంఘటనను పునఃసృష్టి చేయడం గురించి తన మనసు మార్చుకున్నాడని జాన్ సెనా పేర్కొన్నాడు. ఆస్కార్‌లు అందించే డాల్బీ థియేటర్‌లో జాన్ సెనా స్కిట్ ఆద్యంతం క‌డుపుబ్బా న‌వ్వించింది. `పూర్ థింగ్స్` కోసం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును హోలీ వాడింగ్టన్‌కు అందించారు.

స్కిట్ ముగిశాక‌ అవార్డ్ షో నుండి జాన్ సెనా ఎలా వెళ్లాడు? న‌గ్నంగానే వెళ్లిపోయాడా? అన్న‌ది ఆరా తీస్తే.. ఈ బ్యాక్‌స్టేజ్ ఫోటోలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ ఫోటోల్లో అత‌డి కింది భాగానికి ఒక క‌వ‌ర్ ని తొడిగి క‌నిపించాడు. నిజానికి అద్భుతమైన కామెడీ టైమింగ్ జాన్ సెనా స్వంతం. ఆస్కార్ వేదిక‌పై త‌న ప్ర‌తిభ‌ను మ‌రోసారి చూపించాడు అత‌డు.

ఈసారి ఆస్కార్స్ లో ఓపెన్‌హైమర్స్ ఏడు పుర‌స్కారాల‌తో హ‌వా సాగించింది. సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్ ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను గెలుచుకున్నారు. ఈ చిత్రం క్రిస్టోఫర్ నోలన్‌కు ఉత్తమ చిత్రం- ఉత్తమ దర్శకుడు అవార్డులను కూడా అందించింది. పూర్ థింగ్స్ చిత్రానికి గానూ ఎమ్మా స్టోన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ద హోల్డోవర్స్ చిత్రానికి గానూ డావిన్ జాయ్ రాండోల్ఫ్ ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు.

Tags:    
  • Oscars2024 
  • JohnCena 
  • 96AcademyAwards 
  • Ken 
  • BestCostumeDesignaward 
  • JimmyKimmel 
  • DavidNiven 
  • HollyWaddington 
  • CillianMurphy 
  • RobertDowney 
  • ChristopherNolan 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS