• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆపరేషన్ వాలెంటైన్.. ఫైనల్...

ఆపరేషన్ వాలెంటైన్.. ఫైనల్ స్ట్రైక్ సిద్ధం

| ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ ను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 20వ తేదీన ఫైనల్ స్ట్రైక్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

By - Tupaki Desk
Update: 2024-02-19 05:56 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. గట్టి కమ్ బ్యాక్ ఇవ్వడానికి సుమారు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఆయన నటించిన గాండీవధారి అర్జున చిత్రం ఫ్లాప్ గా మిగిలింది. ప్రస్తుతం వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక మేకర్స్ కూడా ఓ రేంజ్ లో ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల పుల్వామా ప్రాంతానికి వెళ్లి అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించారు. అంతకుముందు ఓ సాంగ్ ను ఆర్మీ అధికారుల సమక్షంలో రిలీజ్ చేశారు. తాజాగా మరో క్రేజీ అప్డేట్ తో ముందుకొచ్చారు మేకర్స్.

ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ ను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 20వ తేదీన ఫైనల్ స్ట్రైక్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ అప్డేట్ తోపాటు రివీల్ చేసిన స్పెషల్ పోస్టర్.. సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. అందులో వరుణ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. పోస్టర్ బాటమ్ లో సముద్రంతోపాటు ఫైటర్ జెట్ ను చూపించారు. ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

టెర్రరిస్ట్ ఎటాక్ కు రివెంజ్ గా భారత్ భారీ వైమానిక దాడులు చేయడం చుట్టూ ఈ సినిమా స్టోరీ ఉండనున్నట్లు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌ గా నటిస్తున్న వరుణ్ తేజ్.. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. మరోవైపు, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్.. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగు, హిందీలో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాతోనే దర్శకుడిగా శక్తి ప్రతాప్ పరిచయం అవుతుండగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. ఈ మూవీలో మిర్ సర్వార్, నవదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కంటెంట్ పై మూవీ యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉందట. మరి ఈ సినిమా వరుణ్ కు ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.

Tags:    
  • Varuntej 
  • Operationvalentine 
  • Shaktipratapsingh 
  • Manushichillar 
  • Finalstrike 
  • Trailerupdate 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS