• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రవితేజ కోసం సందీప్ కిషన్...

రవితేజ కోసం సందీప్ కిషన్ డ్రాప్.. కానీ ఆ ఇద్దరు మాత్రం నో

| ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు తెలుగు చిత్ర నిర్మాతలు గట్టిగా పోటీ పడిన సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-01-29 11:38 GMT

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు తెలుగు చిత్ర నిర్మాతలు గట్టిగా పోటీ పడిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. దీంతో అన్ని చిత్రాలకు థియేటర్లు కేటాయించడం కష్టమవుతుండడంతో టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్.. ఒక రెండు సినిమాలను వాయిదా వేసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈగల్ మేకర్స్ తమ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.

కానీ తమ మూవీకి మాత్రం సోలో రిలీజ్ డేట్ కావాలని అప్పుడే ఈగల్ మేకర్స్ కోరారు. అయితే ఫిబ్రవరి 9వ తేదీన ఏ సినిమా రావడం లేదని భావించి ఆ డేట్ ఈగల్ సినిమాకు ఇచ్చింది ఫిల్మ్ ఛాంబర్. కానీ అప్పటికే సందీప్ కిషన్ నటిస్తున్న ఊరు పేరు భైరవకోన, రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాలను అదే డేట్ కు రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు ఆయా మేకర్స్. ఒకరోజు ముందు అంటే ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. వీటిని పరిశీలించకుండా ఫిల్మ్ ఛాంబర్.. ఈగల్ మేకర్స్ కు ఫిబ్రవరి 9 కేటాయించింది.

అయితే తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ కు ఈగల్ మేకర్స్ లేఖ రాశారు. సోలో డేట్ దక్కేలా చూడాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన ఫిల్మ్ ఛాంబర్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి భైరవ కోన, లాల్ సలామ్, యాత్ర 2ను వాయిదా వేసుకోవాలని మేకర్స్ ను కోరింది. అయితే ఊరి పేరు భైరవకోన సినిమా యూనిట్.. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవించి తమ మూవీ రిలీజ్ ను వాయిదా వేసుకుంది.

ఫిబ్రవరి 16న సందీప్ కిషన్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ కు తెలిపింది. కానీ యాత్ర 2 మేకర్స్ మాత్రం తమ సినిమాను వాయిదా వేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారట. రజనీకాంత్ లాల్ సలాం ను వాయిదా వేసుకోవాల్సిందిగా కోరగా.. తమ సినిమాకు తమిళ్ రిలీజ్ కూడా ఉంది కాబట్టి వాయిదా వేసుకోలేమని వారు చెప్పేశారట.

అయితే ఈ విషయాన్ని ఈగల్ నిర్మాతలకు చెప్పగా.. ఇక తమకేం ఇబ్బంది లేదని, అదే డేట్ కు చిత్రాన్ని రిలీజ్ చేసేస్తామని పీపుల్స్ మీడియా వాళ్లు తెలిపారట. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈగల్ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ వచ్చేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు. మొత్తానికి ఈగల్ కు సోలో రిలీజ్ డేట్ దక్కకపోయినట్లే.

Tags:    
  • Ooruperubhairavakona 
  • Sundeepkishan 
  • Eaglemovie 
  • Raviteja 
  • Tollywood 
  • Lalsalam 
  • Rajinikanth 
  • Filmindustry 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS