OG రేట్లు.. వైసీపీ గొడవేంటీ?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ విడుదలకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ విడుదలకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆడియన్స్ లో ఇప్పటికే హైప్ క్రియేట్ చేసుకున్న ఆ సినిమా.. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓజీ టికెట్ల రేట్ల పెంపు జీవో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా కూడా దుమారం రేపింది. పవన్ సినిమాకు అంత రేట్లా అంటూ వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా అంత ఎక్కువనా అంటున్నాయి.
దీంతో పవన్ ఫ్యాన్స్ కొందరు రెస్పాండ్ అవుతున్నారు. అప్పుడు అల్లు అర్జున్ పుష్ప-2 మూవీకి అంతే రీతిలో పెంచారు కదా అని చెబుతున్నారు. ఆ విషయం మాత్రం గుర్తు లేదా అని తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు. అయితే అసలేం జరుగుతోంది?.. ఓజీ రేట్లను ఎంత పెంచుతున్నారు?.. అప్పుడు పుష్ప-2కి ఎంత పెంచారు?
ఓజీ మేకర్స్ రీసెంట్ గా ఏపీ సర్కార్ నుంచి రేట్ల పెంపు జీవో అందుకున్నారు. 25వ తేదీన తెల్లవారుజామున ఒంటి గంటకు బెనిఫిట్ షో పర్మిషన్ సొంతం చేసుకున్నారు. దాని టికెట్ ధర రూ.1000 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. సినిమా విడుదలయ్యే రోజు నుంచి అక్టోబరు 4 వరకు రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు సాధించారు.
సింగిల్ స్క్రీన్స్ లో రూ.125 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ ల్లో రూ.150 (జీఎస్టీ సహా) వరకు అదనంగా పెంచుకొనేందుకు వీలు కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఆ రోజుల్లో డైలీ గరిష్టంగా ఐదు షోలు మాత్రమే వేసుకునే ఛాన్స్ ఇచ్చింది. దీంతో టికెట్ ధరల పెంపు అనుమతిపై ఓజీ మేకర్స్.. సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.
అయితే గత ఏడాది వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పుష్ప-2 మూవీ విషయంలో ఏపీ ప్రభుత్వం.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోలకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాత్రి 9.30 బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్, మల్టీ ఫ్లెక్స్ లలో టికెట్ ధర రూ.800గా నిర్ణయించింది.
పుష్ప 2 రిలీజ్ రోజైన డిసెంబర్ 5న ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 జీఎస్టీ ఛార్జీలతో కలిపి పెంచుకోవచ్చని చెప్పింది. డిసెంబర్ 17 వరకు పెంచిన ధరలు వర్తిస్తాయని వెల్లడించింది. డిసెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.
అయితే పుష్ప-2 బెనిఫిట్ షో టికెట్ రేట్ కూడా అప్పుడు జీఎస్టీతో కలిపి రూ.1000 అయ్యింది. చెప్పాలంటే మల్టీప్లెక్స్ లో ఓజీ కన్నా పుష్పకే ఎక్కువ రేటుగా తెలుస్తుంది. బెనిఫిట్ షోల విషయంలో రెండూ సమానమైన రేట్లు అనే చెప్పాలి. అందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్ వాదనలు ఓ విధంగా కరెక్ట్ అయినప్పటికీ.. సామాన్యులకు మాత్రం ఓజీ రేట్లు పెద్ద భారమే. మరేం జరుగుతుందో వేచి చూడాలి.