• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG లొకేషన్.. ఈ మూమెంట్స్...

OG లొకేషన్.. ఈ మూమెంట్స్ చూశారా..

| తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తోన్న ఆయన.. వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-18 06:17 GMT

ఓ వైపు పాలిటిక్స్ మరోవైపు సినిమాలు అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరింత బిజీగా మారబోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తోన్న ఆయన.. వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నారు. ఇక పవన్ లైనప్ లో ఎన్ని సినిమాలు ఉన్నా అందులో ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీపై అత్యధిక స్థాయిలో హైప్ ఉంది.


యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ముంబై మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే దీన్ని రూపొందిస్తున్నారు. హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న ‘OG’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్ లేకుండా వరుసగా షెడ్యూళ్లను కంప్లీట్ చేశారు.


ఇలా ఇప్పటి వరకూ సగం కంటే ఎక్కువ టాకీ పార్టునే పూర్తి చేసేశారు. కానీ, ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘OG’ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను తాజాగా పున: ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో దీనికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది.

తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హస్మీ వంటి ప్రధాన నటీనటులపై సన్నివేశాలను తీస్తున్నారు. పవన్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. ‘OG’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సెట్స్‌లో తీసిన ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దర్శకుడు సుజిత్, సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్‌లు చర్చలు జరుపుతున్నట్లు కనిపించారు. దీంతో వీళ్లంతా కలిసి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ఓజీ యూనిట్ ఇచ్చిన అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.

ఇక, ‘OG’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • OG 
  • Pawankalyan 
  • Priyankaarulmohan 
  • PrakashRaj 
  • ArjunDas 
  • Sujeeth 
  • RamojiFilmCity 
  • Hyderabad 
  • Shooting 
  • Location 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS