పవన్ ను పొగిడేలా ప్రకాష్ రాజ్ ఎలివేషన్స్?

ఓజీ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ పాత్ర అప్డేట్ రాగానే.. ఫ్యాన్స్ లో ఆత్రుత పెరిగింది.;

Update: 2025-09-18 10:46 GMT

ఓజీ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ పాత్ర అప్డేట్ రాగానే.. ఫ్యాన్స్ లో ఆత్రుత పెరిగింది. రియల్ లైఫ్ లో ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండే ఈ ఇద్దరూ.. సినిమాలో ఒకే స్క్రీన్ పై కనిపించనుండడం ఆసక్తి కలిగిస్తుంది. పవన్ కు సినిమాలో ప్రకాశ్ ఎదురైనప్పుడు థియేటర్లలో ఫుల్ విజిల్స్ పడడం పక్కా. అయితే ఇందులో ప్రకాశ్ పాత్ర ఎలా ఉండనుందో అన్నదే ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది.


రియల్ లైఫ్ లో కొన్నిరోజులుగా ఈ ఇద్దరికీ అస్సలు పడడం లేదు. పాలిటిక్స్ లో ప్రకాష్ రాజ్ చాలాసార్లు పవన్ స్టేట్మెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. అలాగే ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్ పవన్ పై పలుమార్లు ట్వీట్ వార్ కూడా చేశారు. రాజకీయంగా పవన్ సిద్ధాంతానికి ప్రకాశ్ రాజ్ వ్యతిరేకం. ఇలా ట్వీట్లతో ఈ ఇద్దరి మధ్య వ్యవహారం ఎప్పడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ఉంటుంది. ఈ క్రమంలో పవన్ సినిమాలో ప్రకాశ్ రాజ్ నటిస్తుండడంతో సినీ వర్గాల్లో ఆత్రుత పెరిగింది.

ఇందులో ప్రకాశ్ రాజ్- పవన్ మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయో అని ఇప్పట్నుంచే క్యూరియాసిటీ ఎక్కువైంది. అయితే ఈ క్రమంలోనే మరో విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రియల్ లైఫ్ కు పూర్తి భిన్నంగా ఇందులో పవన్- ప్రకాశ్ మధ్య సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. సినిమాలో కొన్ని ఎలివేషన్స్ సీన్స్ కు ప్రకాష్ రాజ్ డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి పరిణామాల మధ్య ఈ ఇద్దరిని బిగ్ స్క్రీన్ పై చూడనుండడం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.

ఇక తాజాగా చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేశారు. సినిమాలో ఆయన సత్య దాదా అనే పవర్ఫుల్‌ పాత్ర పోషించారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రకాశ్‌ రాజ్‌ సీరియస్‌ లుక్‌ లో కనిపిస్తున్నారు. కళ్లజోడు, చేతికి వాచ్, మెడలో మాల ధరించిన లుక్ లో ఉన్నారు. అలాగే ఎడమ కంటిపై దెబ్బ తలిగిన మచ్చ కూడా ఉంది. మొత్తంగా పోస్టర్‌ చూస్తుంటే ఆయనది సినిమాలో కీలకమైన పాత్ర అని అర్థమవుతోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవున్నారు.

సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 25న రిలీజ్ కానుంది. ఇందులో పవన్ తో పాటు ఇమ్రాన్‌ హష్మీ, ప్రియాంకా మోహన్‌, శ్రియారెడ్డి, అర్జున్‌దాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి!

Tags:    

Similar News