OG కోసం ఒరిజినల్ థమన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారని తెలిసిందే.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారని తెలిసిందే. ఎప్పుడైతే ఓజీ గ్లింప్స్ వదిలారో అప్పటి నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా థమన్ బిజిఎం అయితే మాటల్లేవ్ అంతే అనిపించేలా చేసింది. థమన్ మనసు పెట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే అవుట్ పుట్ ఎలా ఉంటుందో తెలిసిందే. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో ఓజీ ఒకటని జస్ట్ శాంపిల్ గా వదిలిన గ్లింప్స్ తోనే ప్రూవ్ చేశాడు.
సుజిత్ కూడా ఓజీ సినిమాను పవర్ స్టార్ కెరీర్ లోనే మోస్ట్ స్టైలిష్ అండ్ గ్యాంగ్ స్టర్ మూవీగా చేయాలని కృషి చేస్తున్నాడు. ఐతే పవన్ కళ్యాణ్ పొలిటికల్ వర్క్స్ వల్ల సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. అసలైతే ఓజీ సినిమా 2024 సెప్టెంబర్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా డేట్స్ అడ్జెస్ట్ అవ్వక పవన్ కళ్యాణ్ షూటింగ్ పోర్షన్ పెండింగ్ ఉండటం వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఐతే ఓజీ సినిమా విషయంలో థమన్ మాత్రం వేరే లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడని అర్థమవుతుంది. గ్లింప్స్ లో వచ్చిన మ్యూజిక్ తోనే పవర్ స్టార్ ఫ్యాన్స్ పూనకాలు అంటుంటే సినిమాలో బి.జి.ఎం నెక్స్ట్ లెవెల్ అంటూ చెబుతున్నాడు. లేటెస్ట్ గా సినిమాకు మళ్లీ పవన్ డేట్స్ ఇస్తున్నాడని తెలుస్తుండగా బిజిఎం వర్క్ కూడా పూర్తి చేసే పనిలో థమన్ ఉన్నాడు. ఓజీ కోసం ఒరిజినల్ థమన్ ని పరిచయం చేయాలని చూస్తున్నాడు. అంటే ఇన్నాళ్లు మనకు మ్యూజిక్ ఇచ్చింది నకిలీ థమనా అని డౌట్ రావొచ్చు. పవర్ స్టార్ సినిమా అది కూడా తన మీద కాపీ ట్యూన్స్ ఇస్తున్నాడన్న కంప్లైంట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం ఇచ్చేలా ఓజీ తో థమన్ ఒరిజినాలిటీ చూపిస్తాడని అంటున్నారు.
సో ఓజీకి పవర్ స్టార్ స్టైలిష్ యాక్షన్ ఎంత హైలెట్ అవుతుందో.. సుజిత్ డైరెక్షన్ ఎంత క్రేజీగా ఉంటుందో.. వాటికి ఏమాత్రం తగ్గకుండా థమన్ మ్యూజిక్ ఉంటుందని తెలుస్తుంది. మరి పవన్ మీద ఉన్న అభిమానాన్ని తన మ్యూజిక్ తో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఓజీ అనే సౌండ్ ఎక్కడ వినిపించినా పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్నా ముందు థమన్ అలర్ట్ అవుతున్నాడు. మరి ఓజీ సౌండ్ రీ సౌండ్ ని థమన్ ఎలా ఫిక్స్ చేస్తారో చూడాలి.