తమన్ నేతృత్వంలో ఓజీ సరికొత్త రికార్డు.. ఏకంగా 117 మంది?
మరి ఇంతకీ తమన్ ఇచ్చిన అప్డేట్ ఏంటి అనేది చూస్తే.. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.;
పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ మరో 17 రోజుల్లో థియేటర్లలో విధ్వంసం సృష్టించబోతోంది.. ఈ సినిమా ఈ నెల అనగా సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సుజీత్ డైరెక్షన్ చేస్తున్న ఈ పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో తాజాగా ఓజీ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.
మరి ఇంతకీ తమన్ ఇచ్చిన అప్డేట్ ఏంటి అనేది చూస్తే.. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం తమన్ ఓజీ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను రికార్డ్ చేస్తున్నారు. లండన్ లోని అబ్బే రోడ్ స్టూడియోస్ లో దాదాపు 117 మంది సంగీత కారులతో కలిసి ఎస్.ఎస్. తమన్ ఓజి మూవీ కోసం స్కోర్ ను రికార్డ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక ఫోటోని తాజాగా తమన్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం తమన్ పంచుకున్న ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.. ఈ పాట కోసం తమన్ నేతృత్వంలో ఓజి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.
ఇప్పటికే ఓజీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తమన్ ఇచ్చిన ఈ అప్డేట్ తో అభిమానుల్లో మరింత సందడి నెలకొంది. పైగా ఈ మూవీ నుండి విడుదలైన రెండు సింగిల్స్ అద్భుతంగా ఉండడంతో పాటు అభిమానులను ఆకట్టుకున్నాయి కూడా .. త్వరలోనే ఓజి మూవీ నుండి మూడో పాట కూడా రిలీజ్ అవబోతుంది. ఈ పాట కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఓజీ మూవీ నుండి రాబోయే మూడో పాట ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఓజీ మూవీ విషయానికి వస్తే..సుజీత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా.. ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము దులుపుతోంది. ఓజీ మూవీకి ఉత్తర అమెరికాలో 50 వేల టికెట్లు అమ్మడైపోయాయి. మరో సెన్సేషనల్ విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు ఓజి మూవీకి సంబంధించిన నైజాం తొలి టికెట్ ని వేలంలో వేయగా.. "టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందం అక్షరాల 5 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అంతేకాదు ఆ 5 లక్షలని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అలా ఓజీ మూవీ విడుదల తేదీ దగ్గర పడే కొద్ది ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది.