• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఫీషియల్: పుష్ప 2 న్యూ...

అఫీషియల్: పుష్ప 2 న్యూ డేట్.. ఇది అసలు మ్యాటర్!

| ఇక ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 ఇప్పుడు డిసెంబర్ 6న విడుదల కానుందని అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటివరకు అద్భుతంగా కొనసాగాయి.

By - Tupaki Desk
Update: 2024-06-17 16:52 GMT

అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప: 2 ది రూల్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న ఈ పాన్-ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా మేకర్స్ నిన్నటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ కాంపౌండ్ లో ఉండేవారు అప్పుడప్పుడు హింట్ ఇచ్చినప్పటికీ బన్నీ ఫ్యాన్స్ అయితే పెద్దగా నమ్మలేదు.

 

ఇక ఫైనల్ గా మేకర్స్ కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిటీ ఇచ్చారు అఫీషియల్ గా ఒక ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేస్తూ న్యూ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ఆ పోస్టర్ లో పుష్పరాజ్ కత్తి పట్టుకొని పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇక ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 ఇప్పుడు డిసెంబర్ 6న విడుదల కానుందని అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటివరకు అద్భుతంగా కొనసాగాయి. సినిమా టీజర్, టైటిల్ ట్రాక్, మరియు కపుల్ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను దోచేశాయి.

 

అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుందట. మల్టీ లాంగ్వేజ్ లో విడుదల అవుతున్నట్లు చెబుతూ సినిమా ఆలస్యంగా వస్తున్న విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. లేట్ అయినా బెస్ట్ అవుట్ ఫుట్ అందించడానికి కట్టుబడి ఉన్నాం అని చిత్ర బృందం తెలిపింది. మిగతా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం కొంత సమయం అవసరమని, అందుకే విడుదల తేదీ మార్చాల్సి వచ్చిందని వివరించారు.

అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ.. దర్శకుడు సుకుమార్ స్టైల్ కు తగ్గట్లే, భారీ అంచనాలను మించి సినిమాను డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని అత్యంత ఖరీదుగా నిర్మిస్తున్నారని.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ మిరెస్లో కుబా బ్రోజెక్ తమ కెరీర్ లోనే అత్యుత్తమ పనితీరును ప్రదర్శించనున్నారని కూడా తెలియజేశారు.

ఇక రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ ప్రధాన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. 'పుష్ప: ది రైజ్' ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సృష్టించిన రికార్డులు, అల్లు అర్జున్ నటన, సుకుమార్ మేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉంటుందని చిత్రబృందం ధీమాగా ఉంది. మరి న్యూ రిలీజ్ డేట్ ఆడియెన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    
  • Pushpatherule2 
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukmar 
  • Rashmikamandanna 
  • Theatricalrelease 
  • Fahadfaisal 
  • Mythrimoviemakers 
  • Moviepostponed 
  • Pushpa 
  • Bunny 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS