• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓదెలా 2.. పవర్ఫుల్...

ఓదెలా 2.. పవర్ఫుల్ సీక్వెల్ లో మిల్కీ బ్యూటీ

| ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతోంది.

By - Tupaki Desk
Update: 2024-03-01 06:05 GMT

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తమన్నా భాటియా ప్రస్తుతం డిఫరెంట్ ప్రాజెక్టులను లైన్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. తన ప్రతి సినిమాలో కూడా ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతోంది.


ఆ సినిమాకు ప్రముఖ మాస్ దర్శకుడు సంపత్ నంది క్రియేటర్ గా ఉండగా అశోక్ తేజ దర్శకత్వం వహించబోతున్నారు. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఓదెల 2 అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టు తెరపైకి రాబోతోంది. 2022లో ఓటీటీలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రైమ్ త్రిల్లర్ కథను సంపత్ నంది అందించారు. డైరెక్టర్ అశోక్ తేజ మేకింగ్ విధానం సినిమాలో బాగా హైలైట్ అయింది. ఇక అదే టీం తో ఇప్పుడు ఓదెల 2 అనే టైటిల్ తో మరొక ప్రాజెక్టును వెండితెరపై తీసుకురాబోతున్నారు. ఈసారి అంతకుమించిన కథనంతో భారీ క్యాస్టింగ్, బెస్ట్ ప్రొడక్షన్, హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ కథ యూనివర్సల్ గా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందట. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మధు క్రియేషన్స్ లో D మధు ఈ ప్రాజెక్టు ను నిర్మిస్తున్నారు. ఇక సినిమాను ఈరోజు అధికారికంగా లాంచ్ చేస్తూ రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నారు.

సినిమా కథ విషయానికి వస్తే ఓదెల మల్లన్న స్వామి ఒక గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఇలా రక్షిస్తాడు అనే పాయింట్ తో రాబోతున్నట్లు సమాచారం. ఇక టైటిల్ పోస్టర్ లో త్రిశూలంలో శివుడి బొట్టు హైలెట్ అయ్యే విధంగా ఉంది. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. తప్పకుండా సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని తెలుస్తోంది. ఓదెలా 2 సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట, యువ, నాగమహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి లాంటి వారు నటిస్తున్నారు.

Tags:    
  • Odela2 
  • Tamannaahbhatia 
  • Sampathnandi 
  • Ashokteja 
  • Odelarailwaystation 
  • OTT 
  • Odelamallannaswamy 
  • Hebahpatel 
  • Vasishta 
  • Yuva 
  • Nagamahesh 
  • Vamsi 
  • Gaganvihari 
  • Surenderreddy 
  • Bhupal 
  • Poojareddy 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS