గోల్డెన్ కెమెరాతో గోల్డెన్ బ్యూటీ.. వారెవ్వా నైరా!

నైరా బెనర్జీ.. ఈ పేరు వింటే టాలీవుడ్ మూవీ లవర్స్ కు గుర్తు రాదేమో అమ్మడు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు మధురిమగా ఆమె పరిచయమయ్యారు.;

Update: 2026-02-23 04:52 GMT

నైరా బెనర్జీ.. ఈ పేరు వింటే టాలీవుడ్ మూవీ లవర్స్ కు గుర్తు రాదేమో అమ్మడు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు మధురిమగా ఆమె పరిచయమయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ కు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం టచ్ లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు నెట్టింట కొత్త కొత్త పిక్స్ పోస్ట్ చేసే అమ్మడు.. తాజాగా వైట్ కలర్ గౌన్‌ లో మెరిసిపోతూ కనిపించారు. చేతిలో గోల్డెన్ కెమెరా పట్టుకుని స్టైలిష్ పోజులు ఇచ్చారు.




 


ఆ లుక్‌ లో ఆమె గ్లామర్‌ తో పాటు క్లాసీ టచ్ కూడా ఉండడంతో నెటిజన్లు, యూత్ ఫిదా అవుతున్నారు. ఫోటోలతో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంది. "గోల్డెన్ లెన్స్.. తెల్లని శక్తి.. కళ్లంతా లాక్ అయ్యాయి. కేవలం చిత్రాలను క్లిక్ చేయడం కాదు, మీ వైబ్‌ ను క్యాప్చర్ చేస్తున్నా" అంటూ రాసుకొచ్చి నెటిజన్లను ఆకర్షించారు. ప్రస్తుతం నైరా బెనర్జీ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సూపర్ లుక్, ఎలిగెంట్ బ్యూటీ, గోల్డెన్ గర్ల్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ పిక్స్ మేడమ్ అని చెబుతున్నారు. అయితే 2009లో వచ్చిన ఆ ఒక్కడు సినిమాతో హీరోయిన్‌ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు నైరా. తర్వాత సరదాగా కాసేపు చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాతో ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది.

దీని తర్వాత ఆరెంజ్, షాడో, కొత్త జంట, టెంపర్ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు నైరా బెనర్జీ. అలాగే దోచేయ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌ లో కనిపించారు. అయితే ఆ తర్వాత మెల్లగా టాలీవుడ్‌ కు దూరమయ్యారు. అదే సమయంలో తెలుగులో అవకాశాలు తగ్గిన తర్వాత హిందీ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన నైరా, పలు సీరియల్స్, వెబ్ సిరీసుల్లో నటిస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 18లో కంటెస్టెంట్‌ గా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్‌ గా ఉంటూ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. రెగ్యులర్‌ గా ఫోటోషూట్లు, గ్లామర్ పిక్స్, ట్రావెల్ వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇటీవల బికినీ ఫోటోలు, హాలోవీన్ నైట్ స్టిల్స్ కూడా వైరల్ అయ్యాయి. లేటెస్ట్ వైట్ గౌన్ లుక్ ఆ లిస్ట్ లో చేరింది. ఏదేమైనా టాలీవుడ్‌ కు దూరమైనా, సోషల్ మీడియాలో నైరా తన స్టైల్‌ తో మూవీ లవర్స్ ను అలరిస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News