ఫోటో స్టోరి: బాప్ రే! నయా జిగేల్ రాణీ కౌన్ హై?
టాలీవుడ్ తెరపై ఒకప్పుడు `మధురిమ`గా సుపరిచితురాలైన నైరా బెనర్జీ ఇప్పుడు తన రూపాన్ని పూర్తిగా మార్చేసి వార్తల్లో నిలుస్తోంది.;
టాలీవుడ్ తెరపై ఒకప్పుడు `మధురిమ`గా సుపరిచితురాలైన నైరా బెనర్జీ ఇప్పుడు తన రూపాన్ని పూర్తిగా మార్చేసి వార్తల్లో నిలుస్తోంది. వంశీ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో ఎంతో పద్ధతిగా..అమాయకంగా కనిపించిన ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో `జిగేల్ రాణి`ని తలపించేలా అల్ట్రా మోడ్రన్ ఫోటోషూట్‌లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా తాజా సన్‌ఫ్లవర్ థీమ్ ఫోటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మాధురి నటించిన గత సినిమాలను చూసిన వారికి ఇది ఒక షాకింగ్ మేకోవర్ అని చెప్పక తప్పదు.
కెరీర్ తొలినాళ్లలో ఆ ఒక్కడు, సరదాగా కాసేపు వంటి చిత్రాల్లో మధురిమ పోషించిన పాత్రలు ఒక రకంగా గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. అయితే ఆ ఇమేజ్ గుర్తింపునిచ్చినా కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో మాత్రం పరిమితులు విధించింది. అందుకే కాబోలు తన పేరును మధురిమ నుండి నైరా బెనర్జీగా మార్చుకోవడమే కాకుండా.. తన ఆహార్యంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ పేరు మార్పు కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయానికి సంకేతంగా భావించాలి.
ప్రస్తుతం నైరా దృష్టి పూర్తిగా బాలీవుడ్ - డిజిటల్ వేదికలపైనే ఉంది. `వన్ టు చా చా చా` వంటి హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే.. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలి బో*ల్డ్ ఫోటోషూట్‌లతో నైరాకు మంచి గుర్తింపే దక్కుతోంది. తన ఇన్ స్టాగ్రమ్ ని పరిశీలిస్తే మారుతున్న మార్కెట్ ట్రెండ్స్‌ను మాధురి ఎంతగా అర్థం చేసుకుందో తెలియజేస్తోంది. తాజాగా మధురిమ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్ లో గుబులు రేపుతోంది. అలా పొద్దు తిరుగుడు పువ్వును చేతిలో పట్టుకుని పింక్ హాఫ్ షోల్డర్ ఫ్రాక్ లో మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ యువతరంలో వైరల్ గా దూసుకెళుతోంది. మధురిమను ఇలా చూడగానే మళ్లీ తెలుగులో ఎప్పుడు నటిస్తుంది? అంటూ ఎంక్వయిరీలు మొదలయ్యాయి.
సోషల్ మీడియా అనేది నేడు నటీనటులకు ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. సినిమాలు లేకపోయినా.. నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడం వల్ల బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు.. వెబ్ సిరీస్ అవకాశాలు మెరుగవుతాయి. నైరా కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తూ తన ఫాలోవర్లను అలరిస్తోంది. ఈ అందాల భామ చూపించే ఈ కాన్ఫిడెన్స్ .. అల్ట్రా మోడ్రన్ లుక్ తనను సమకాలీన పోటీలో ముందు వరుసలో నిలబెడుతాయనడంలో సందేహం లేదు.
అయితే మధురిమ తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు ఒక గతం. పాత ఇమేజ్‌ను చెరిపేసి కొత్తగా ఆవిష్కరించుకోవడం అంత సులభం కాదు. కానీ నైరా బెనర్జీ ఆ మార్పును ఎంతో ధైర్యంగా ఆహ్వానించిందని అర్థమవుతోంది. ఈ గ్లామర్ అస్త్రం సెకండ్ ఇన్నింగ్స్ కి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.