ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయా
ఎన్ని హిట్లున్నా, ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అన్నిసార్లు అనుకున్నట్టు ఛాన్సలు రావు. ఓ హిట్ సినిమాలో నటించామని ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమాల్లో కూడా తమని తీసుకోవాలని రూలేం లేదు.;
ఎన్ని హిట్లున్నా, ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అన్నిసార్లు అనుకున్నట్టు ఛాన్సలు రావు. ఓ హిట్ సినిమాలో నటించామని ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమాల్లో కూడా తమని తీసుకోవాలని రూలేం లేదు. దానికి తోడు ఈ రోజుల్లో మొదటి భాగంలో ఒకరు నటిస్తే సెకండ్ పార్ట్ లో మరొకరిని తీసుకోవడం ఫ్యాషనైపోయింది. చాలా మంది ఇదే రూల్ ను ఫాలో అవుతున్నారు.
ఈ విషయంలో నటి నుష్రత్ బరూచా ఇబ్బంది పడినట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆయుష్మాన్ ఖురానా, నుష్రత్ బరూచా కలిసి నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. డ్రీమ్ గర్ల్ సినిమాతోనే నుష్రత్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడడింది. ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన డ్రీమ్ గర్ల్2 లో హీరోయిన్ గా తనకు బదులు అనన్యా పాండేను తీసుకోవడంపై అమ్మడు అసహనం వ్యక్తం చేసింది. టీమ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ నుష్రత్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
డ్రీమ్ గర్ల్2 టీమ్ తీసుకున్న డెసిషన్ తననెంతగానో బాధించిందని, ఫస్ట్ పార్ట్ లో నటించిన వారంతా సెకండ్ పార్ట్ లో కూడా నటించారని, కేవలం తనను మాత్రమే చిత్ర యూనిట్ పక్కన పెట్టిందని, తన ప్లేస్ లో వేరే హీరోయిన్ ను తీసుకున్నారని, ఆ విషయాన్ని అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయానని నుష్రత్ బరూచా వెల్లడించింది. అయితే తనను తీసుకోనందుకు టీమ్ తో తానేమీ ఫైట్ చేయలేదని కూడా నుష్రత్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది.
తాను ఫైట్ చేసినంత మాత్రాన సిట్యుయేషన్స్ మొత్తం మారిపోయి ఆ పాత్ర కోసం తననేమీ తీసుకోరని, సినిమాలో తనను తీసుకోకపోవడానికి కారణాన్ని అడిగినా తమకు అవసరం లేదనే చెప్తారని తెలుసు కాబట్టే ఈ విషయంలో తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఏదేమైనా సినిమాలో ఎవరిని తీసుకోవాలో, ఎవరిని తీసుకోకూడదో నిర్మాతల ఇష్టమని, వాళ్ల ఇష్టాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని నుస్రత్ చెప్పుకొచ్చింది.
2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్2 బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలవడంతో పాటూ మంచి కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమాలో నుష్రత్ కు బదులు అనన్యను తీసుకోవడానికి గల కారణాన్ని గతంలోనే హీరో ఆయుష్మాన్ ఖురానా ఓ సందర్భంలో చెప్పారు. కథకు అనుగుణంగానే అనన్యను తీసుకున్నామని, ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో హీరోయిన్ క్యారెక్టర్ మరింత సరదాగా ఉంటుందని, ఆ పాత్రకు అనన్య అయితేనే సరైన న్యాయం చేయగలదని భావించి మేకర్స్ అనన్యను ఫైనల్ చేశారని ఆయన చెప్పారు.