• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర న్యూ ట్విస్ట్.....

దేవర న్యూ ట్విస్ట్.. రిలీజ్ అప్పుడేనా?

| యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న పవర్‌ ఫుల్ మూవీ దేవర

By - Tupaki Desk
Update: 2024-01-28 07:32 GMT

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న పవర్‌ ఫుల్ మూవీ దేవర. యాక్షన్ మోడ్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ లుక్‌ తో రికార్డుల ఊచకోత ఖాయమని ఫ్యాన్ప్ ఫిక్సయిపోయారు. సూపర్ స్పీడ్‌ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్పి ఉంది. కానీ దేవర రిలీజ్‌ పోస్ట్‌ పోన్ అంటూ ఇటీవలే వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ ను కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి.

రెండు పార్టులుగా దేవర సినిమా విడుదల కానుండగా.. తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీఖాన్ ఇటీవలే గాయాలపాలయ్యారు. దీంతో మూవీ షూటింగ్ కూడా లేట్ అవుతుందంటూ ఇంకొన్ని వార్తలు వచ్చాయి..

అయితే ఆగస్టులో దేవర సినిమా రిలీజ్ అవుతుందని ఇటీవలే వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 రిలీజ్ పక్కా అని బన్నీ టీమ్ ఇటీవలే కన్ఫర్మ్ చేయడంతో దేవర మరో డేట్ లోకి వెళ్లినట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. ఈ మూవీ ఫైనల్ గా దసరా కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరైన్, మురళీ శర్మ కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ కావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ నిర్ణయించుకుంది. మరి రిలీజ్ డేట్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.


Tags:    
  • Devara 
  • NTR 
  • Janhvikapoor 
  • Koratalasiva 
  • Devaramovie 
  • Saifalikhan 
  • Devarafilm 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS