ఆయన ఇండియాలోనే గొప్ప నటుడు: విశ్వక్ సేన్

నా దృష్టిలో జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అని విశ్వక్ సేన్ అన్నాడు. ఆయన యాక్టింగ్ ని నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు.

Update: 2024-04-28 08:03 GMT

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మూవీ విశేషాలని మీడియా మీట్ లో పంచుకున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో తాను చేసిన రోల్ కెరియర్ లో బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. చాలా కాలం నుంచి ఇలాంటి పాత్ర చేయాలని అనుకుంటున్నానని, ఈ సినిమాతో అది సెట్ అయ్యిందని అన్నాడు. ఈ సందర్భంగా తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా దృష్టిలో జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అని విశ్వక్ సేన్ అన్నాడు. ఆయన యాక్టింగ్ ని నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు.

ఎప్పటికైనా అతని అంత మంచి యాక్టర్ అనిపించుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నానని విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ కి విశ్వక్ సేన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. విశ్వక్ సేన్ సినిమా ఈవెంట్స్ కి తారక్ అటెండ్ అయ్యి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. విశ్వక్ సేన్ కూడా ఇండస్ట్రీలో అందరి కంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానిస్తూ ఉంటాడు. ఓపెన్ డయాస్ మీద విశ్వక్ సేన్ తన అభిమానాన్ని చాలా సార్లు తెలియజేశాడు.

Read more!

మరోసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా తారక్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. చిత్ర నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ అందరికంటే గట్టిగా తొడకొడతాడని, విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాలో అలాగే కొట్టాడని అన్నారు. కచ్చితంగా సినిమాలో విశ్వక్ సేన్ క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పాడు.

ఇదిలా ఉంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మే10న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా టీజర్ మాస్ టచ్ తో పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటుంది. కచ్చితంగా ఈ సినిమాతో విశ్వక్ సేన్ సూపర్ హిట్ కొడతాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మూవీలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Tags:    

Similar News