'దేవర' ఆకు చాటు పిందె తడిసే...!

ఎన్టీఆర్‌ మరియు జాన్వీ కపూర్‌ ల కాంబో కి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.

Update: 2024-05-06 09:10 GMT

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా రూపొందుతున్న దేవర సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఎన్టీఆర్‌ మరియు జాన్వీ కపూర్‌ ల కాంబో కి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో సీనియర్ ఎన్టీఆర్‌ మరియు శ్రీదేవి కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరు రొమాంటిక్ సాంగ్స్ లో ఆడి పాడారు. ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మరియు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ రొమాంటిక్‌ సాంగ్‌ లో ఆడి పాడబోతున్నారు.

ఎన్టీఆర్‌, శ్రీదేవి 'వేటగాడు' సినిమా కోసం చేసిన ఆకు చాటు పిందె తడిసే పాట ఎంతటి హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మరియు జాన్వీ కపూర్‌ చేయబోతున్న రొమాంటిక్ సాంగ్‌ కూడా ఆ స్థాయిలో ఉండే విధంగా దర్శకుడు కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది.

దేవర సినిమా కోసం ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ ల రొమాంటిక్ సాంగ్‌ అనగానే చాలా మంది ఆకు చాటు పిందె తడిసే ను రీమిక్స్ చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ పాట రీమిక్స్ అయ్యింది. కనుక ఎన్టీఆర్‌ ఆ ఆలోచన చేయక పోవచ్చు.

ఆ పాట కాకున్నా మరే పాట వీరిద్దరి కాంబోలో వచ్చినా కూడా కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం. దేవర సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్‌ లోనే ఈ రొమాంటిక్ సాంగ్ ఉంటుందని, రెండో పార్ట్‌ లో కూడా మరో మంచి రెమాంటిక్ నెంబర్ ఉంటుందని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది

Tags:    

Similar News