నీల్.. ఈ'సారీ' నో ఛేంజ్..
సినిమా ఎప్పుడు వస్తుంది.. షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. తర్వాత అప్డేట్ ఎప్పుడు ఇస్తారు.. స్టార్ హీరోల చిత్రాల విషయంలో ఫ్యాన్స్ కు ఇలాంటి డౌట్లు రావడం సహజం.
సినిమా ఎప్పుడు వస్తుంది.. షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. తర్వాత అప్డేట్ ఎప్పుడు ఇస్తారు.. స్టార్ హీరోల చిత్రాల విషయంలో ఫ్యాన్స్ కు ఇలాంటి డౌట్లు రావడం సహజం. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గర మాత్రం ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్లకు వెంటనే దొరకవు. సినిమా వర్క్స్ జరుగుతున్నా, బయట మాత్రం ఎక్కడా పెద్దగా హడావుడి కనిపించదు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ విషయంలోనూ నీల్ అదే ఫాలో అవుతున్నారు!
కేజీఎఫ్, సలార్ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నీల్.. ఇప్పుడు తారక్ తో ఎలాంటి మూవీ తీస్తున్నారోనని ఇంట్రెస్ట్ అందరిలో ఉంది. అయితే ఆ సినిమా గురించి కంటిన్యూ అప్డేట్స్ వస్తాయని వెయిట్ చేసే ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే ఎదురవుతోంది. షూటింగ్ కు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నా.. మూవీ టీమ్ నుంచి పెద్దగా సమాచారం రావడం లేదు.
ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో షూటింగ్ ఆలస్యమవుతుందని, దాని ప్రభావం డ్రాగన్ విడుదల తేదీపై పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటివరకు ఇతర సీన్స్ పూర్తి చేసేలా నీల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ షూటింగ్ షెడ్యూల్స్ పై మాత్రం అప్డేట్స్ లేవు.
ప్రశాంత్ నీల్ సినిమాల విషయంలో మొదటి నుంచి ఒక ప్రాసెస్ కనిపిస్తుంది. షూటింగ్ జరుగుతున్నంత కాలం ఆయన బయట పెద్దగా మాట్లాడరు. సినిమా గురించి వరుస అనౌన్స్మెంట్లు చేయడం, తరచూ కొత్త విషయాలు వెల్లడించడం లాంటివి ఆయన చాలా తక్కువగా చేస్తారు. స్టోరీ, క్యాస్టింగ్, రిలీజ్ డేట్ వంటి విషయాలు ప్రకటించిన తర్వాత కూడా ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపించరు.
గతంలో కేజీఎఫ్, సలార్ సినిమాల సమయంలో కూడా ఇదే జరిగింది. అభిమానులు అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నా.. ప్రశాంత్ నీల్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లారు. సినిమా విడుదలకు దగ్గరపడిన తర్వాతే ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు. దీంతో ఆయన నుంచి ఎప్పుడు ఏ సమాచారం వస్తుందోననే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతూనే ఉంటుంది.
ఇప్పుడు డ్రాగన్ విషయంలో కూడా అదే పద్ధతి కంటిన్యూ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నా.. ఎన్టీఆర్ గాయం, షూటింగ్ షెడ్యూల్స్, విడుదల తేదీపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నా, అఫీషియల్ గా చెప్పాల్సిన విషయాల విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ తన ప్లాన్ ను అస్సలు మార్చుకోవడం లేదు.
సినిమాపై అంచనాలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నా, ఆ అంచనాలకు తగ్గట్టుగా అప్డేట్స్ మాత్రం రావడం లేదు. అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నా ప్రశాంత్ నీల్ నుంచి వెంటనే రెస్పాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు మూవీ గురించి మాట్లాడటం కంటే.. సిల్వర్ స్కీన్ పై చూపించడమే ముఖ్యం. అందుకే డ్రాగన్ విషయంలో కూడా అప్డేట్స్ కు సారీ.. తన పద్ధతిలో మాత్రం నో ఛేంజ్ అనే స్టేట్మెంట్ సరిపోతుందేమో!