ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ అప్డేట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎన్టీఆర్‌నీల్ అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవగా, రీసెంట్ గా వారం కిందట ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యాడు. మొన్నటి వరకు ఎన్టీఆర్ వార్2 షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఆయన లేకుండానే నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ షూట్ లో జాయిన్ అవడం వల్ల సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ షూటింగ్ ప్రస్తుతం బెంగుళూరులో జరుగుతుంది. ఎన్టీఆర్ జాయిన్ అయిన తర్వాత నుంచి కొత్త యాక్షన్ షెడ్యూల్ ను మొదలుపెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. డ్రాగన్ షూటింగ్ పై ఇప్పుడు ఓ కొత్త అప్డేట్ వినిపిస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్ మరో మూడు వారాల పాటూ అదే లొకేషన్ లో జరగనుందని, ఈ యాక్షన్ సీక్వెన్స్ ను నీల్ నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేశాడని, సినిమాలోని హైలైట్స్ లో ఇది కూడా ఒకటిగా నిలవడం ఖాయమని చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. అయితే మూడు వారాల్లో మధ్యలో ఎన్టీఆర్ ఓ రెండురోజులు బ్రేక్ తీసుకోనున్నాడని సమాచారం.
డ్రాగన్ సినిమాలో ఫ్యాన్ మూమెంట్స్ ఎన్నో ఉండనున్నాయని, ఫ్యాన్స్ కు సినిమా ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ మూవీ కోసం మునుపెన్నడూ లేనంత స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యడు. ఈ సినిమాలో శృతి హాసన్ కనిపించనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి కానీ అందులో ఏ మాత్రం నిజముందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తో పాటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా కలిసి నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.